మన హీరోలకు యాక్టింగే రాదంటూ ఇద్దరు ప్రబుద్ధులు కారుకూతలు(వీడియో)

I Hate Heroes Video On Tollywood Heroes

12:37 PM ON 8th June, 2016 By Mirchi Vilas

I Hate Heroes Video On Tollywood Heroes

వెర్రి వేయి విధాలు అన్నారు.. ఇది చూస్తే, పిచ్చి తారాస్థాయికి చేరిందని చెప్పేయొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... వీరంతా టాలీవుడ్ అగ్రహీరోలు. వీరిలో ఒక చిరంజీవి మినహాయిస్తే అందరికి నట వారసత్వం ఉందన్నది తిరుగులేని నిజం. అయితే కేవలం వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ కారణంగానే గుర్తింపు రాలేదు. తమ యాక్టింగ్ టాలెంట్ తో, స్వశక్తితో ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఎదిగారు. అభిమానుల గుండెల్లో కొలువుదీరారు. ఇది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. ఇంకా చెప్పాలంటే అదృష్టం కూడా వారిని వరించింది.

అయితే ఓ ఇద్దరు యువకులు మాత్రం.. ఓవరాక్షన్ చేశారు. టాలీవుడ్ టాప్ హీరోలను తక్కువ చేసి మాట్లాడుతూ, వారికి అసలు యాక్టింగే రాదని కారు కోతలు కూసారు. తెలుగులో ఇప్పుడున్న అగ్ర హీరోలంతా యాక్టింగ్ రాని వాళ్ళేనని కేవలం బ్యాక్ గ్రౌండ్ కారణంగానే వాళ్ళు కథానాయకులుగా రాణిస్తున్నారని విషం కక్కుతూ ఆ ఇద్దరు యువకులు తీసిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఐ హేట్ హీరోస్ పేరుతో ఇద్దరు యువకులు వీడియో రూపొందించి యు ట్యూబ్ లో పెట్టడంతో, అది చూసిన వాళ్ళు నిర్ఘాంత పోతున్నారు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అందరిని అదేపనిగా తిడుతూ పాట పాడారు. అంతేకాదు ఆ టాప్ హీరోల ఫొటోలను తగలేశారు.

చిరంజీవి నటన పక్కన పెడితే, ప్రజారాజ్యంతో ప్రజలను మోసం చేసాడు, బాలయ్యకు వాళ్లయ్య ఉన్నాడు గనుక నటసింహం అయ్యాడు, నాగార్జున ఏఎన్నాఆర్ బ్యాంక్ గ్రౌండ్ తో కింగ్ అయిపోయాడు, నాయుడి గారి వల్ల వెంకటేష్ విక్టరీ అయ్యాడు, పూర్తిగా యాక్టింగ్ రాని పవన్.. పవర్ స్టార్ అయ్యాడు, సరిగా మాట్లాడలేని మహేష్ ప్రిన్ అయ్యాడు, పెదనాన్న సపోర్ట్ తో ప్రభాస్ యంగ్ రెబెల్ అయ్యాడు, సర్జరీలు చేసుకుని అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అయ్యాడు, హైట్ లేకున్నా బ్యాంక్ గ్రౌండ్ వెయిట్ తో ఎన్టీఆర్ యంగ్ టైగర్ అయ్యాడు., టాలెంట్ లేకున్నా, యాక్టింగ్ రాకున్నా మన సంపూ అన్న హీరో అయ్యాడు... అంటూ వీరి పాట సాగుతుంది.

అందరూ హీరోలు అయ్యారు, తామేమో జీరోలయ్యామన్న దుగ్దతోనే ఇలా వీడియో పెట్టినట్లు అంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా.. సినిమాల్లో ఒక్క చాన్స్ కూడా రాలేదట. ఎవరి దగ్గరికి వెళ్లినా అందరూ బ్యాక్ గ్రౌండ్ అడుగుతున్నారని వాపోయారు. వారి ఉద్దేశ్యం గురించి మరో మాటలో చెప్పాలంటే పరిశ్రమ మొత్తం వారసులతో నిండిపోయిందట.

ఒకటి మాత్రం నిజం... ఎవరి ఉద్దేశాలు ఏమైనా కావొచ్చు, వారికి ఎవరిపైనైనా ద్వేషం ఉండొచ్చు. అందులో తప్పులేదు. కానీ ఏకంగా హీరోలను తిట్టడమే కాకుండా వాళ్ళకు యాక్టింగ్ రాదంటూ ఫోటోలను తగులబెట్టడం, దాన్ని వీడియో తీయడం ఏమీ బాగోలేదని ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆ ఇద్దరు ప్రబుద్దుల తీరుపై మండిపడుతున్నారు. హీరోలను వేలెత్తి చూపించే ముందు.. అసలు మీకు ఏ మాత్రం యాక్టింగ్ వచ్చో చెప్పాలని నిలదీస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇకపోతే వీడియోని పాపులర్ చేసుకునేందుకు ఆ ఇద్దరు యువకులు ఇలాంటి చీప్ ట్రిక్ ప్లే చేశారని మరికొందరు రుసరుసలాడుతున్నారు.

ఒకప్పుడు హుందాగా వుండే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఇలాంటి వికృత చేష్టలు ఎందుకు ఎలా వస్తున్నాయో , సినీ పెద్దలు దృష్టి సారించాలి. లేకుంటే, భవిష్యత్తులో మరింత వెర్రి తలలు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:బికినీలో బిగ్ బి మనవరాలు రెచ్చిపోయింది (వీడియో)

ఇవి కూడా చదవండి:సినీ నటుడ్ని బోల్తా కొట్టించారు ... లక్షలు దోచేశారు

English summary

Two Men uploaded a controversial video on our Tollywood Heroes by saying that they don't know acting and they were in Telugu Film industry because of their Back Ground.Heroes fans were firing on this video makers.