నా ప్రాణాలకు ముప్పు వుంది.. నిండు సభలో మొరపెట్టుకున్న శశికళ

I have a threat in Tamil Nadu

03:42 PM ON 1st August, 2016 By Mirchi Vilas

I have a threat in Tamil Nadu

అవును, నిజంగా పార్లమెంట్ లో ఈ ఘటన జరిగింది. ప్రభుత్వం నా ప్రాణాలు కాపాడుతుందా? నాకు రక్షణ కావాలి. నా ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభలో సోమవారంనాడు కన్నీరుమున్నీరయ్యారు. తన ప్రాణాలకు ముప్పుందంటూ ఆమె సభలో పేర్కొనడం సభ్యులను షాక్ కి గురిచేసింది. ఆమె సభలో తన గోడు వెళ్లబుచ్చుకోవడానికి కొద్దిసేపటికి ముందే పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారంటూ శశికళను అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు జయలలిత ఒక ప్రకటన చేశారు. అసలు వివరాల్లోకి వెళ్తే..

శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే ఎంపీ తిరుచ్చి శివకూ, శశికళ పుష్పకు మధ్య మాటామాటా పెరగడం, తిరుచ్చి శివను శశికళ చెంపదెబ్బ కొట్టారు. ఇది సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వెంటనే శశికళను పార్టీ నుంచి జయలలిత సస్పెండ్ చేశారు. దీంతో రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ, తన ప్రాణాలకు తమిళనాడులో ముప్పు ఉందంటూ మొరపెట్టుకుంది. రాజ్యాంగబద్ధమైన పదవి నుంచి రాజీనామా చేయాలని బలవంతం చేస్తున్నారని ఆమె సభలో చెప్పారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గులాం నబీ ఆజాద్ అండగా నిలిచారు. ఒక సభ్యురాలు సభలో ఏదో చెప్పాలనుకుంటున్నారు. రేపు మరొకరికి మరేదో జరగవచ్చు. అప్పుడు సభలో చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వరా? శశికళ మాట్లాండేందుకు అనుమతించండి అని అన్నారు.

దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ సభ్యులు ఎవరైనా చేసిన తప్పుకు విచారం వ్యక్తం చేస్తే సరిపోతుంది. అంశం ఏదైనా అది పార్లమెంటు ప్రతిష్టను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సభ్యురాలు విచారం వ్యక్తం చేశారు. అంతటితో ఆ విషయం ముగిసిపోయింది. ఎవరికైనా భద్రత సమస్య ఉంటే చైర్మన్ కు లేఖ రాసి ఆ విషయం తెలియజేయాలి అని అన్నారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ జోక్యం చేసుకుంటూ సభ్యురాలిని ఆందోళనను పరిగణనలోకి తీసుకుని చేయాల్సింది తప్పనిసరిగా చేస్తాం. గౌరవ చైర్మన్ తరఫున మీకు నేను హామీ ఇస్తున్నాను అంటూ ఈ అంశానికి తెర దించారు.

English summary

I have a threat in Tamil Nadu