దాని కోసమే నాకు మగాడు కావాలి

I need Man for that only: Priyanka Chopra

01:24 PM ON 28th January, 2016 By Mirchi Vilas

I need Man for that only: Priyanka Chopra

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తన సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా క్వాంటికో పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు గెలుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇటీవల ప్రియాంక 'పద్మశ్రీ' పురస్కారం కూడా గెలుచుకుంది. ప్రియాంక తరువాత 'జై గంగాజల్‌' అనే సినిమాలో కనిపించనుంది. ఈ ముద్దుగుమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రియాంక మహిళల సాధికారత కోసం ఎంతో చేసింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్‌వ్యూ లో ఆమె ఎవరిపైనా ఆధారపడనని స్పష్టం చేసింది.

తన జీవిత భాగస్వామి గురించి అడిగితే, తను మగాడి పై ఆధారపడననీ, తను వజ్రాలు కొనిపించుకోవడానికి జీవిత భాగస్వామి అక్కరలేదని తనకు తానే కొనుక్కోగలనని చెప్పింది. అంతేకాకుండా ఆమె పిల్లల కోసం మాత్రమే జీవిత భాగస్వామి కావాలనుకుంటున్నానని నిస్సంకోచంగా సమాధానం చెప్పింది.

English summary

Priyanka Chopra gave a latest interview. In that interview I need Man only for children. And iam very happy for getting PadmaShri award.