మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదు

I Never Say Bharat Mata Ki Jai Says Asaduddin Owaisi

10:18 AM ON 15th March, 2016 By Mirchi Vilas

I Never Say Bharat Mata Ki Jai Says Asaduddin Owaisi

సంచలన వ్యాఖ్యలకు వచ్చే స్పందన , జరిగే చర్చ వలన వచ్చే కిక్కు వేరయ్యా అంటారు. మరి అది నిజమేననిపించేలా కొందరు సంచలన వ్యాఖ్యలు చేసి , వివాదాస్పదం కావడం, ఇక వాటిపై విమర్శలు ప్రతి విమర్శలు చోటుచేసుకోవడం పరిపాటి అయింది. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓ వివాదాస్పద వ్యాఖ్య చేసారు. మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదని లాతూర్ జిల్లాలోని ఉద్గిర్‌లో జరిగిన బహిరంగ సభలో అసద్ అనేసారు. ఇలా అసద్ అనగానే, బహిరంగ సభకు హాజరైనవారు అలా హర్షధ్వానాలు చేశారు. భారత్ మాతా కీ జై అని రాజ్యాంగంలో ఎక్కడ ఉందని అసద్ ప్రశ్నించారు. ఈ నెల మూడున ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ విద్యను జాతీయీకరణ చేయాలని చెప్పడంపై అసదుద్దీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కొత్త తరాలతో భారత్ మాతా కీ జై అనిపించాలన్న మోహన్ భాగవత్ సూచనను తోసిపుచ్చారు. ఈ నేపధ్యంలోనే తాను మెడపై కత్తిపెట్టినా భారత్ మాతా కీ జై అనబోనని స్పష్టం చేసారు. అసద్ వ్యాఖ్యలపై దుమారం రేగింది.

English summary

MIM Party leader and MP Asaduddin Owaisi says that he never he Never Say Bharat Mata Ki Jai even though some one puts sword on his neck.