అప్పటి నుంచి మళ్ళీ కాలేజి ముఖం చూడలేదు

I never went to college after Baazigar movie says shilpa shetty

11:08 AM ON 12th March, 2016 By Mirchi Vilas

I never went to college after Baazigar movie says shilpa shetty

పలు భాషల్లో నటించి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తోన్న శిల్పాశెట్టి కుంద్రా ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, నటిగా మారి తర్వాత వ్యాపారవేత్తగా అందరికీ పరిచయమైంది. ఎంత ఎదిగినా, ఆమె తన ఫిట్‌నెస్‌ మాత్రం మరిచిపోలేదు. నగరంలోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ‘ఏ హోలిస్టిక్‌ అప్రోచ్‌ టు లైఫ్‌ అండ్‌ ఏ సైంటిఫిక్‌ వే ఆఫ్‌ బీయింగ్‌ ఫిట్‌’ అనే అంశంపై యంగ్‌ ఫిక్కీలేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ)ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైంది. ఆ సందర్భంగా నగర సోషలైట్‌ పింకీరెడ్డితో పాటు వైఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్‌ సామియా ఆలంఖాన్‌, ఇతరసభ్యులు వేసిన పలు ప్రశ్నలకు శిల్పాశెట్టి స్పందించింది. 'కాలేజీ టైమ్‌లోనే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చా. అప్పట్లో నేను వాలీబాల్‌ ప్లేయర్‌ గా 5 సార్లు స్టేట్‌ టీమ్‌కు రిప్రజెంట్‌ చేశా. కరాటే తదితర స్పోర్ట్స్‌ కూడా ఆడేదానిని. బేసికల్‌గా ఎవరైనా సరే స్పోర్ట్స్‌ను ఫాలోకావడం మంచిది. విద్యార్థులు ఆడాలి. శారీరక ఫిట్‌నెస్‌ రావటానికి స్పోర్ట్స్‌ అవసరం' అని వివరించింది. ఇంకా శిల్పా మాట్లాడుతూ, "నేను ‘బాజీగర్‌’ సినిమా చేస్తున్నప్పుడు కూడా కాలేజీకి వెళ్లా. అప్పట్లో సినిమాల్లో చేస్తున్న కారణంగా కాలేజీలో నన్ను ఓ సెలబ్రిటీ స్టాటస్‌తో చూసేవారు. నాతో ఫొటోలు తీయించుకునే వారు. ఇక ‘బాజీగర్‌’ హిట్‌ అవ్వడంతో మళ్లీ కాలేజీ ముఖం చూడలేదు. ఆ హిట్‌.. నా కాలేజీ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది." అని వివరించింది.

English summary

Bollywood Heroine Shilpa Shetty says that every one have to do Exercises and she remembered her childhood days and she said that at the time of Baazigar movie she was studying and when she went to college so many people were taken photos with her and later after the super hit of that movie she never went to college.