మీరు కొన్న ఆ ఫోన్లను తిరిగిచ్చేయండి.. లేదంటే మీ పనంతే: పోలీసులు వార్నింగ్!

I phone 7 phones was selling in India

05:13 PM ON 26th September, 2016 By Mirchi Vilas

I phone 7 phones was selling in India

యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7+ లు మొబైల్స్ ఇంకా ఇండియాలో లాంచ్ చేయని సంగతి తెలిసిందే. అయితే.. ఇవి మాత్రం ఢిల్లీలోని బ్లాక్ మార్కెట్ లో యధేచ్ఛగా దొరికిపోతున్నాయి. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి.. అతని వద్ద 75 ఐ ఫోన్ 7, 7+ లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఆదివారం ఓ వ్యక్తి ఐ ఫోన్లు దిగుమతి చేసుకుంటూ కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 75 ఐఫోన్లు 7 & 7+ లను స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. ఈ ఫోన్ ల విలువ 46.39 లక్షలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

కస్టమ్స్ అధికారుల విచారణలో పట్టుబడ్డ వ్యక్తి.. తాను హాంగ్ కాంగ్ నుంచి దిగుమతి చేసుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఐఫోన్లు ఢిల్లీలోని పాలికా, గఫ్సార్, లజపతి నగర్ బజార్లలో అమ్ముతున్నట్లు తెలిపాడు. దీనితో 7 రోజుల్లో మొత్తం 100 ఫోన్లు దిగుమతి చేసుకున్నట్లు అధికారులకు తెలిపాడు. దీనితో బ్లాక్ మార్కెట్ లో ఈ మొబైైల్స్ కొన్నవారు వాటిని పోలీసులకు అప్పగించాలని.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే!

ఇది కూడా చదవండి: చారిత్రాత్మక 500వ టెస్టులో భారత్ ఘన విజయం!

ఇది కూడా చదవండి: రకుల్ మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

English summary

I phone 7 phones was selling in India. A man imported 75 i phone 7 and 7+ mobiles from Hong Kong and selling in Delhi in block market.