కారులో పేలిన ఐఫోన్ 7!

I phone 7 was blasted in car

12:34 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

I phone 7 was blasted in car

ఎంతో ఖరీదు పెట్టుకుని కొనుక్కున్న స్మార్ట్ ఫోన్లు పేలడంపై ఇటీవల పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా సామ్ సంగ్ నోట్ -7 ఫోన్లు ఎక్కువగా పేలుతున్న విషయం వింటూనే ఉన్నాం. ఒక రకంగా దీని వల్ల ఐఫోన్-7 అమ్మకాలు కూడా పెరిగాయి. అయితే తాజాగా ఐఫోన్ 7 కూడా పేలిందంటూ ఒక కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీంతో తక్షణం స్పందించిన సదరు ఆపిల్ కంపెనీ విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ పేలిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. జోన్స్ అనే వ్యక్తి తాను కొత్తగా కొనుక్కున్న ఐఫోన్-7ను తన కారులో ఉంచాడు. అయితే కొద్ది సమయంలో తిరిగి వచ్చే సరికి కారులో మంటలు, పొగలు రావడం గమనించాడట.

ముఖ్యంగా తన ఫోన్ పూర్తిగా కాలిపోయిందని, దాని నుంచే మంటలు వచ్చాయని దాని వల్లే ఈ ప్రమాదం జరిగిందని జోన్స్ అంటున్నాడు. ఖరీదైన ఫోన్లే ఇలా కాలిపోతుంటే, ఇక మిగిలిన ఫోన్లు ఎలాంటి కొంప ముంచుతాయోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

English summary

I phone 7 was blasted in car