ఆత్మహత్య చేసుకుంటానంటున్న బాలీవుడ్ హీరోయిన్

I Will Commit Suicide Says Heroine Alisa Khan

12:12 PM ON 24th August, 2016 By Mirchi Vilas

I Will Commit Suicide Says Heroine Alisa Khan

అలా పెళ్లి చేసుకోవడం ... ఇలా వదిలేయడం ఈమధ్య బాలీవుడ్ లో జరుగుతోంది. టాలీవుడ్ కూడా ఇలాంటి ఘటనలకు వేదిక అవుతోంది. అయితే తాజాగా బాలీవుడ్ నటి అలీసాఖాన్ ప్రస్తుతం ఇలాంటి పెద్ద చిక్కులో ఇరుక్కుంది. ప్రస్తుతం ఇమ్రాన్ హస్మితో చేస్తున్న అలీసా ఖాన్ స్వస్థలం ఘజియాబాద్. ఈమె హిందీ చిత్రాల్లోనే కాక పలు తమిళ సినిమాల్లో సైతం నటించింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నడిరోడ్డుపై వదిలి వెళ్లడంతో దిక్కులేనిదయింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అలీసా ఖాన్ నటుడు లవ్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అలీసా కుటుంబ సభ్యులు ఆమెతో సంబంధాలు తెంచేసుకున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో భర్త లవ్ కపూర్ తనను వదిలేసి వెళ్లిపోయాడని తనకు న్యాయం చేయాలని హరిద్వార్ పోలీస్ స్టేషన్ లో అలీసా ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు కూడా తన ఫిర్యాదు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తోంది. లవ్ కపూర్ కానీ, అతడి కుటుంబ సభ్యులు కానీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వెంటనే స్పందించిన హరిద్వార్ పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:జబర్ధస్త్ వినోదిని గురించి తెలిస్తే షాకవుతారు!

ఇవి కూడా చదవండి:ఖైదీ నెంబర్ 150లో రాజమౌళి కొడుకు!

English summary

Veteran Bollywood Heroine Threatens to Commit suicide. She said that she was married by Bollywood Actor Love Kapoor. She says that no one was taking her complaint and her husband love kapoor left him. Due to her threaten to commit suicide officials filed a case on Love Kapoor in Haridwar Police Station.