అన్నీ చూపిస్తాను అది తప్ప!!

I will do all scenes except nude scenes

11:08 AM ON 29th January, 2016 By Mirchi Vilas

I will do all scenes except nude scenes

'లేడీస్ వర్సస్ రిక్కీ బాల్' చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా. పరిణీతి తన మొదటి చిత్రం నుండే ఘాటైన ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్ లలో రెచ్చిపోయి మరి నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరిగా అడుగు పెట్టిన పరిణీతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఎప్పుడూ కొంచెం బొద్దుగా ఉండే పరిణీతి ఒక్కసారిగా బరువు తగ్గి స్లిమ్‌ గా రెడీ అయింది. అంతే కాదు హాట్ హాట్ గా ఫొటోషూట్ కూడా చేసింది. తనకి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గి పోవడమే ఇందుకు కారణమని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అనేది వాస్తవం.

అయితే పరిణీతి ఎప్పుడూ ఎటువంటి మొహమాటం లేకుండా మొహం మీదే మాట్లాడేస్తూ ఉంటుంది. ఈమె లావు తగ్గాక మరి ఇప్పుడు కూడా మునిపటి లా లిప్ లాక్స్ మరియు శృంగార సన్నివేశాల్లో నటిస్తారా? అని పరిణీతి ని అడిగితే లిప్ లాక్స్ మరియు శృంగార సన్నివేశాలకి నేనెప్పుడూ రెడీ నే. కథ డిమ్యాండ్ చేస్తే ఏది చేయడానికి అయినా సిద్ధమే నాకు అటువంటి అభ్యంతరం ఏమీ లేదు. నా మొదటి చిత్రం నుండి అలాంటి సన్నివేశాల్లో నటిస్తూనే ఉన్నాను. ఇబ్బందిగా ఎప్పుడూ ఫీల్ కాలేదు. అయితే పూర్తి నగ్నంగా నటించలేను. ఎందుకంటే మన దేశంలో ఇంకా అటువంటి నాగరికత రాలేదు. ఇప్పట్లో వస్తుందని కూడా అనుకోవడం లేదు. నేనైతే నగ్నంగా నటించడానికి ఇష్టపడను అని చెప్పింది ఈ హాట్ బ్యూటీ.

English summary

Bollywood hot beauty Parineeti Chopra says that I will act in lip lock scenes and bed scenes but I didn't act in nude scenes.