క్రియాశీలక రాజకీయాల్లోకి

I will Enter in Politics Says Mohan Babu

06:08 PM ON 19th March, 2016 By Mirchi Vilas

I will Enter in Politics Says Mohan Babu

ముక్కుసూటిగా మాట్లాడే కలెక్షన్ కింగ్ , డైలాగ్ కింగ్ మోహన్ బాబు శనివారం తన పుట్టినరోజును ఎప్పట్లా శ్రీ విద్యానికేతన్ సంస్థలో జరుపుకుంటున్న సందర్భంగా సందర్భంగా ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా రాజకీయాల నుంచి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చాడు." పేపర్‌ తీస్తే వీళ్ల మీద వాళ్లు, వాళ్ల మీద వీళ్లు బురద చల్లుకునే వార్తలే ఎక్కువగా వున్నాయి. వీటిని ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు. అడవిలో జంతువులు ఆహార మైథునాల కోసం కలహించుకుంటాయి, కలుస్తుంటాయి. అది ప్రకృతి సహజం. ఇక్కడ మనుషులు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇది ప్రకృతి సహజం కాదు. అన్నింటిలో మానవ జన్మ ఉత్తమమైంది. ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. మంచి చెయ్యాల్సిన వాళ్లు చెయ్యకుండా పోతే అది వెంటాడుతూనే ఉంటుంది. ఇవాళ స్వార్థం మరీ ఎక్కువైపోయింది. రోజు రోజుకూ రాజకీయం దిగజారిపోతోంది. సినిమా పరిశ్రమలోనూ విలువలు లేవు. చిన్న నిర్మాతలు దెబ్బతింటున్నారు. ఎన్నో యేళ్లుగా చిన్న నిర్మాతకు న్యాయం చెయ్యాలని అనుకుంటున్నామే కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాం" అంటూ అటు సినీ , ఇటు రాజకీయాలపై మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

ముద్రగడతో భేటీలో రాజకీయం లేదు ....

ఇటీవల ముద్రగడ పద్మనాభంను విష్ణు కలవడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించడం గురించి మోహన్ బాబు ప్రస్తావిస్తూ, "ముద్రగడ పద్మనాభం మాకు చిరకాల మిత్రుడు. విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడు. నా సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు" అని మోహన్ బాబు చెప్పాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు రాజకీయంగా కొంతమందికి సపోర్ట్‌ ఇచ్చాను. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తా. ఏ పార్టీ అనేది అప్పుడే చెబుతా’’ అని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.

ఏ పార్టీలోకి వస్తాడో ...

రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్న మోహన్ బాబు ఏ పార్టీలో చేరనున్నాడో నని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పడు ఎన్టిఆర్ వుండగా టిడిపిలో క్రియాశీలక పాత్ర వహించి, రాజ్యసభ సభ్యుడుగా కూడా ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఆతర్వాత టిడిపికి దూరంగా ఉంటూ వచ్చాడు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో మోహన్ బాబు కు బంధుత్వం వుంది. వైఎస్ సోదరుని కుమార్తెను మోహన్ బాబు కుమారుడు విష్ణు వివాహం చేసుకున్నాడు కదా... జగన్ తో కూడా సత్సంబంధాలు ఉండనే వున్నాయి. కొన్నాళ్ళు బిజెపి సానుభూతి పరునిగా వున్న మోహన్ బాబు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో చేరి , క్రియాశీలకంగా వ్యవహరిస్తారో మరి .

English summary

Senior Hero Mohan Babu in an interview said that he was planning and he will defenately come into politics.