ఆ డైరెక్టర్ ని చంపేస్తా

I will Kill That Director

05:19 PM ON 29th January, 2016 By Mirchi Vilas

I will Kill That Director

సినిమా చూస్తున్నంత సేపు పక్కింటి అబ్బాయ్ గుర్తుకి వచ్చేవిధంగా తన నటనతో మెప్పించిన వర్ధమాన హీరో రాజ్ తరుణ్ ముచ్చట గా మూడు సినిమాల హిట్ తో హాట్రిక్ హీరో అయ్యాడు. తాజాగా సీతమ్మ అందాలు , రామయ్య సిత్రాలు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే దర్శకుడిని చంపేస్తా ననే స్థాయికి వెళ్ళేలా ఇతగాడికి ఎందుకో కోపం వచ్చేసింది. అంతగా బాధించిన అంశం ఏమిటి ? ఇంతకీ అసలు విషయానికి వస్తే , స్టార్ హీరోయిన్ల పక్కన వేయాలని నాకూ వుందని , ముఖ్యంగా సమంతతో వేయాలనే కోరిక వుందని అంటున్నాడు. అయితే ఆమెకు తమ్ముడి పాత్రయినా చేసే ఉద్దేశ్యం ఉందా అని అడిగేసరికి 'ఇంకానయం.. నిజంగా అలాంటి కథ పట్టుకొస్తే ఆ దర్శకుడ్ని చంపేస్తానేమో' అంటూ నవ్వేసాడట. శ్రీదేవి గురించి గతంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలను వంట బట్టించుకున్నాడేమో రాజ్ తరుణ్ . అందుకే ఇలాంటి సిల్లీ జోక్స్ పేల్చేస్తున్నాడు.

English summary

Young Hero Raj Tarun Says that he wants to act with Samantha and he says that if any director asks him to act as a brother to samantha then he will kill him.