'బాహుబలి -2' ని మొదటి రోజే చూస్తా: రణవీర్‌సింగ్‌!!

I will see Baahubali -2 movie on first day: Ranveer Singh

07:03 PM ON 28th December, 2015 By Mirchi Vilas

I will see Baahubali -2 movie on first day: Ranveer Singh

బాలీవుడ్‌ లో తాజాగా విడుదలైన 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హీరో రణవీర్‌సింగ్‌ తన మనస్సులో మాట బయటపెట్టాడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి' చిత్రం నాకెంతగానో నచ్చింది. ఇందులో భళ్లాలదేవునిగా నటించిన రానా దగ్గుబాటి నటన అద్భుతం, రానా కచ్చితంగా పెద్ద స్టార్‌ అవుతాడు అంటూ బాహుబలి విడుదల అయినప్పుడే రణవీర్‌సింగ్‌ చెప్పాడు. అయితే ఇప్పడు బాహుబలి -2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను, ఈ చిత్రం విడుదల రోజునే సినిమా చూసేస్తాను అని రణవీర్‌ సింగ్‌ తన మనసులో మాట బయట పెట్టాడు.

ఒక్క రణవీర్‌సింగ్‌ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతో మంది స్టార్‌ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు ఈ చిత్రం కోసం ఎదరు చూస్తున్నారు. డిసెంబర్‌ 16న మొదలైన బాహుబలి -2 షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 2016 డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యొచ్చు. రాజమౌళి ఈ చిత్రాన్ని బాహుబలి కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

English summary

I will see Baahubali -2 movie on first day: Ranveer Singh