జైలుకి వెళ్లడానికి రెడీ: శింబు

Iam ready to go jail: Simbu

11:50 AM ON 18th December, 2015 By Mirchi Vilas

Iam ready to go jail: Simbu

తమిళ స్టార్‌ యాక్టర్‌ శింబు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఒక బీప్‌ సాంగ్‌ వల్ల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ పాట పాడిన శింబు, సాంగ్‌ కంపోజ్‌ చేసిన అనిదుధ్‌ల పై మహిళా సంఘాలు వాళ్ల పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ పాట లిరిక్స్‌ లో మహిళలని ఉద్దేశించి అసభ్యకర పదాలతో దూషించడమే ఇందుకు కారణం. శింబు, అనిరుధ్‌లపై మహిళా సంఘాలు ఫిర్యాదు చెయ్యడంతో కోయంబత్తూర్‌ పోలీస్‌ అధికారులు శింబు, అనిరుధ్‌లని అరెస్ట్‌ చెయ్యడానికి చెన్నై వెళ్లారు. అయితే ఒక సంగీత కచేరీ కార్యక్రమం కోసం అనిరుధ్‌ టొరంటో వెళ్లడంతో, శింబు పోలీసులు రాక ముందే పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

అయితే ఇప్పుడు శింబు ఈ విషయం పై స్పందిస్తూ నేను ఎక్కడికీ పారిపోలేదు, చెన్నైలోనే ఉన్నాను నేను తప్పుగా పాడినట్లు రుజువైతే జైలుకి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే శింబు, అనిరుధ్‌ డిసెంబర్‌ 19 లోపు పోలీసుల ముందు హాజరు కావల్సిందిగా కోయంబత్తూర్‌ పోలీస్‌వారు ఆర్డర్‌ వేశారు. అయితే అనిరుధ్‌ సంగీత కచేరీ కోసం టొరంటో వెళ్లాడని తను 19 లోపు తిరిగి వచ్చేస్తాడని తను వచ్చిన వెంటనే పోలీస్‌ స్టేషన్‌లో హాజరువుతామని శింబు తెలిపాడు.

English summary

Iam ready to go jail: Simbu