చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్

IAS non co-operation to Chandra Babu

03:01 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

IAS non co-operation to Chandra Babu

ఐఏఎస్ లు తలచుకుంటే పాలకులకు చుక్కలు చూపించగలరు. ఇప్పుడు ఏపీలో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు పట్ల ఓ ఐఏఎస్ చేస్తున్నది ఇదేనని అంటున్నారు. అసలు సీఎం మాట ఆ.. ఒక్క ఐఏఎస్ వినడం లేదట! ఇంతకూ ఎవరంటే, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) టక్కర్ అట. ఇటీవల కాలంలో క్యాబినెట్ ప్రతిపాదనల్లో వేటికీ ఆమోదముద్ర వేయడం లేదట. ఎందుకంటే అవన్నీచంద్రబాబు అండ్ కో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అవ్వడమే కారణమట. ఆఘమేఘాల మీద తన వద్దకు వస్తున్న కొన్ని ఫైళ్లను వెనువెంటనే తిప్పుతున్నారట! గతంలో సాగునీటి ప్రాజెక్టుల అంచనా పెంపునకు సంబంధించిన ఫైల్ ను కూడా అప్పటి సీఎస్ కృష్ణారావు,

ఇప్పటి సీఎస్ వెనక్కు పంపి తమ నుంచి ఏ తప్పూ జరగకుండా ఉండేలా జాగ్రత్తవహించారట! తాజాగా రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఏ ఒక్క ఫైల్ ను ఆమోదించేందుకు అంగీకరించడం లేదని అంటున్నారు. వాస్తవానికి పనులన్నింటినీ విదేశీ కంపెనీలకు కట్టబెట్టే యోచనలో ఉండడం, అధికారుల నిర్ణయాలతో సంబంధం లేకుండా క్యాబినెట్ ఆమోదించేసి దానిని ముఖ్యమంత్రికి పంపి, అటు పై అధికారుల వద్దకు పంపడం ఇటీవల కాలంలో తరుచూ జరుగుతున్న ప్రక్రియ. ఇదెంతమాత్రం సహించని అధికారులు, సిఎస్ ఇలా అంతా ఒక్కటై బాబుకు చుక్కలు చూపిస్తున్నారట!

జగన్ కేసుల విషయంలో అప్పట్లో కొందరు ఐఏఎస్ లు ఏ విధంగా ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగారో అందరికీ తెలిసిందే.. అందుకే మళ్లీ ఆ తరహా తప్పులు చేసేందుకు ఇప్పటి ఐఏఎస్ లు అంతగా సిద్ధంగా లేరనే సంకేతాలు ఈ విధంగా ఇస్తున్నారట. అంతేకాదు, ఇటీవలే సీఆర్డీఏ అధికారుల పై సీఎస్ ఫైర్ అయ్యారట! సంబంధిత అధికారుల అభిప్రాయం తీసుకోకుండా ఫైళ్లను ఎలా తెస్తారంటూ సీఆర్డీఏ అధికారులను నిలదీశారట! దీంతో ఈ ఫైళ్లకు సంబంధించి శాఖలవారిగా అభిప్రాయం తీసుకునేందుకు సీఆర్డీఏ అధికారులు సన్నద్ధమవ్వగా, సీఎం ఆమోదం తెలిపిన ఫైళ్లపై అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉద్యోగులకు ఉందంటారా? అని సీఎస్ ప్రశ్నించారట.

మొత్తంగా సింగపూర్ కంపెనీలకు రాజధాని నిర్మాణపు పనులు కట్టబెట్టేయాలన్న సీఎం ఆలోచనకు ఆదిలోనే సీఎస్ టక్కర్ బ్రేక్ వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎస్ చేసే పనికి కూడా సీనియర్ అధికారులు సైతం అండగా నిలుస్తున్నారని వినిపిస్తోంది. రాజధాని విషయంలోనే కాదు జిల్లాల్లోనూ పలువురు కలెక్టర్లు మొండిగానే వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం తీరు అయితే చెప్పక్కర్లేదు. సీఎం గారు మీ వాళ్లెవరో ప్రభుత్వ భూమి ఇచ్చేయమంటున్నారు ఇచ్చేయాలా అని ఫోన్ చేసి మరీ, క్లారిఫికేషన్ తీసుకుంటున్నారట!

మంత్రి అచ్చెన్నాయుడు స్పీడ్ కి సైతం కలెక్టర్ బ్రేక్ తన పంధాలో వెళ్ళిపోతున్నారట. ఇప్పటికప్పుడు బాబు చెప్పినట్లు తల వంచితే రేపటి వేళ కోర్టుల చుట్టూ తిరగాల్సింది తామేనని అధికారులు హడలిపోతున్నారు. అందుకే ఏ ఒక్క ఫైల్ విషయంలోనూ త్వరితగతిన నిర్ణయం వెలువరించక తాత్సారం చేస్తున్నారు. పోనీ.. నేను చెప్పాను.. మీరు చేయండి అని చంద్రబాబు అనగలరా.. లేదు కదా! అందుకే బాబు వెర్సస్ సీఎస్ వ్యవహారం నానాటికీ మరింత వేడెక్కుతోంది కూడా. అంతేకాదు, ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు, వైఎస్ ప్రభుత్వంలో మాదిరిగా అధికారులకు ఇబ్బందులు ఉండవని,

స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని కూడా అనడం మొత్తానికి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నడుమ సత్సబంధాలు మెరుగు పడతాయా లేదా అన్నది వేచి చూడాలి.

English summary

IAS non co-operation to Chandra Babu