అవమానంతో ఐఎఎస్ ఫ్యామిలీ ఆత్మహత్య

IAS Officer Family Suicide In Delhi

10:56 AM ON 20th July, 2016 By Mirchi Vilas

IAS Officer Family Suicide In Delhi

9లక్షలు లంచం తీసుకున్న కేసులో రెండు మూడు రోజుల క్రితం ఢిల్లీలో కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ బి.బన్సాల్ అరెస్టయ్యారు. అయితే ఆయన ఇంట్లో భార్య, కుమార్తె సూసైడ్ చేసుకున్నారు. తూర్పు ఢిల్లీలోని వాళ్ల ఇంట్లో బన్సాల్ భార్య సత్యబాల(57), ఆయన కుమార్తె నేహ(27) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. భార్య, కుమార్తె వేర్వేరుగా రాసిన రెండు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒక ఫార్మా కంపెనీ నుంచి రూ.9 లక్షలు లంచం తీసుకుంటుండగా ఐఎఎస్ అధికారి బన్సాల్ ను సిబిఐ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. సదరు ఫార్మా కంపెనీ నుంచి బన్సాల్ రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్టు సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. అవమానభారంతోనే బన్సాల్ భార్య, కూతురు ఆత్మహత్యకు పాల్పడిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన పలువురిని కలచి వేసింది. పాపం ఓ కుటుంబం బలైపోయిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:రాహుల్ కు దిమ్మతిరిగే షాక్

ఇవి కూడా చదవండి:అందాల ఆరబోతతో సమంత రెచ్చిపోయిన ఫోటోషూట్(వీడియో)

English summary

Delhi IAS Officer B.Bansal was caught red handedly by CBI in Delhi while taking money from a pharma company and he was arrested two days back and his wife and his daughter have been committed suicide by feeling shame.