జగన్ తో సేల్ఫీ ల భాగోతం  - ఐఏఎస్ లకు ముచ్చెమటలు

IAS Officers Selfie With Jagan Mohan Reddy

03:12 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

IAS Officers Selfie With Jagan Mohan Reddy

ఒక్కోసారి తాడే పామై కరుస్తుందని అంటారు ... సరిగ్గా ఇప్పడు కొందరి ఐఏఎస్ ల విషయంలో అదే జరిగేలా వుందట. అందుకే వారికి ముచ్చెమటలు పడుతున్నాయట. ఇంతకీ వారు చేసిన నేరం ఏమంటే జగన్ తో సేల్ఫీ ముచ్చట తీర్చుకోవడమేనట. మరి గుట్టుగా సాగిన ఈ భాగోతం ప్రభుత్వానికి ఎలా తెల్సిపోయిందంటే, వివరాల్లోకి వెళ్ళాల్సిందే.

హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం ఎప్పటిలాగే వచ్చిపోయే ప్రయాణికులతో సందడి నెలకొంది .. ఆ రోజు తిరుపతి వెళ్లే విమానాన్ని క్యాచ్‌ చేసేందుకు ఐఏఎస్‌లు... ఇతర ఉన్నతాధికారులు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. మరుసటి రోజు తిరుపతిలో ఓ ఉన్నతస్థాయి సమావేశం ఉండటంతో వీరంతా ముందు రోజే తిరుపతికి బయలుదేరారు. ఫ్లయిట్‌ బోర్డింగ్‌ ప్రారంభమైన వెంటనే ఐఏఎస్‌లు చకచకా విమానం ఎక్కారు. ఆ తర్వాత కొద్దిసేపటికి..అంటే పది నిమిషాల్లో ఫ్లయిట్‌ బయలుదేరుతుందనగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తిరుపతి వెళ్లేందుకు అదే ఫ్లయిట్‌ ఎక్కారు. ప్రతిపక్ష నాయకుడిని ప్రోటోకాల్‌ ప్రకారం గౌరవించవలసిందే! అందుకే కొంతమంది ఐఏఎస్‌లు జగన్‌కు హుందాగా విష్‌ చేసి, తమ తమ స్థానాల్లో కూర్చుకున్నారు.. జగన్మోహన్‌ రెడ్డి కూడా వారికి ప్రతి నమస్కారం చేసి ముందు వరుసలో కూర్చున్నారు. అయితే జగన్ ఉన్నాడన్న విషయం తెల్సిన కొందరు ఐఏఎస్‌లు ఓవర్ ఏక్షన్ చేసారట. జగన్ పక్కన కూర్చుని సెల్ఫీలు మాటామంతీ ! షేక్‌హ్యాండ్‌లూ ... ఈలోపు ఫ్లయిట్‌లోకి వచ్చిన ప్యాసింజర్‌లు కూడా ఈ సెల్ఫీల ముచ్చటను చూసి తమ సీట్లలో ఆశీనులయ్యారు.

టైమ్‌ ప్రకారం ఫ్లయిట్‌ టేకాఫ్‌ అయ్యింది.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. అయితే అసలు కథ ఇక్కడ ప్రారంభమైంది.. ల్యాండ్‌ అయిన వెంటనే అదే ఫ్లయిట్‌లో ఉన్న ఇద్దరు క్యాబినెట్‌ మంత్రులు తాపీగా ముందుకు వచ్చి నిలబడ్డారు. వీరిని చూసిన ఐఏఎస్‌లకు ముచ్చెమటలు పట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. అందుకే మంత్రులు కనీసం జగన్ వైపు కన్నెత్తి చూడలేదు.. కాకపోతే అంతకు ముందు ఫ్లయిట్‌లో జరిగిన సెల్ఫీల ముచ్చటను మాత్రం కనులారా వీక్షించారు. అంతేకాదు, జగన్‌ గురించి ఇద్దరు ముగ్గరు ఐఏఎస్‌లు చేసిన కామెంట్లను కూడా చెవులారా విన్నారు. మంత్రులు ముందుకు వచ్చి నిలబడ్డ సంగతిని కొంతమంది ఐఏఎస్‌లు గమనించలేదు. ఎందుకంటే వారు కునుకు తీస్తున్నారు. అయితే కిందకు దిగిన తర్వాత మంత్రులను తీసుకువెళ్లేందుకు కాన్వాయ్‌ రావడంతో వచ్చిన వారెవరు అని తమను తీసుకువెళ్లేందుకు వచ్చిన తిరుపతి అధికారులను అడిగారు. ఇద్దరు మంత్రులు వచ్చారని చెప్పటంతో ఫ్లయిట్‌ దిగిన ఆ ఐఏఎస్‌ అధికారులకు నిద్రమత్తు వదిలింది. ముచ్చెమటలు పట్టాయట.

ఇక రేణిగుంట ఎయిర్‌పోర్టులో కారెక్కిన వెంటనే మంత్రులు ఈ బాగోతాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉప్పు అందించారు. మినిట్‌ టూ మినిట్‌ సీఎంవోలోని ఉన్నతాధికారులందరికీ సినిమాలా చూపించారు. అసలే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతాయని విస్తృతమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సెల్ఫీల ముచ్చట తమ కొంప ముంచుతుందేమోనని కొందరు ఐఏఎస్‌లు తెగ బాధపడిపోతున్నారట! అయ్యేయ్యో మంత్రులు విమానంలో ఉన్నారని తెలిస్తే, గప్ చిప్ గా వుండేవారం కదా అనుకుంటున్నారట. తల రాతను ఎవరూ తప్పించలేరు కదా మరి .

విజయ్‌ మాల్యా గురించి షాకింగ్‌ నిజాలు

మొగుడిలో మేటర్ లేదని విడాకులు కోరింది

బాలయ్యకు ఆస్కార్‌ వ(చ)చ్చి తీరుతుందట

షకలకశంకర్‌ను పవన్ రావద్దన్నాడా?

విశ్వవ్యాప్తంగా రంగుల హోలీ

English summary

Ysrcp Party leader Y.S.Jagan Mohan Reddy and Some of the IAS Officers of Andhra Pradesh Take Selfies and chatted with Jagan on On Board Flight.This was seen by the Andhra PRadesh Ministers who were sitting back of them.Ministers have complained this thing to Government and Government was preparing to take Action On Them.