ఐబాల్‌ నుంచి మరో స్మార్ట్ ఫోన్‌

Iball Andi New Smart Phone

05:53 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Iball Andi New Smart Phone

ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఐబాల్‌ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆండి 5.5 హెచ్‌ వెబర్‌ పేరిట ఈ ఫోన్‌ని విడుదల చేసినట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. దీని ధరను మాత్రం కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. దాని ధర రూ. 7,499గా ఉండవచ్చని భావిస్తున్నారు. వినియోగదారులకు మాత్రం ఈ ఫోన్ రూ. 6,299కే దొరకవచ్చని చెపుతున్నారు.

ఐబాల్‌ ఆండి 5.5హెచ్‌ వెబర్‌లో 5.5 అంగుళాల ఐపీఎస్ తాకే తెర, 720*1280 పిక్సల్ డెన్సిటీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిట్టమ్, 1.3 గిగాహెడ్జ్‌ ఆక్టా కోర్ ప్రాసెసర్‌, 2మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగా పిక్సెల్‌ రేర్‌ కెమేరా, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ అంర్గత స్టోరేజీ సామర్థ్యం(32 జీబీ వరకు పెంచుకోవచ్చు), 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ 21 భారత ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుందని కంపెనీ తన వెబ్ సైట్ లో వెల్లడించింది.

English summary

iBall has introduced the Andi 5.5H Weber smartphone, which is now listed on the company's site.Now this smart phone is now available to buy in the markets and has been given a best buy price of Rs. 6,299, while the MRP is Rs. 7,499.