ఐబాల్‌ నుంచి యాండీ 5.5 వెబర్

iBall Andii 5.5H Weber Smart Phone

04:44 PM ON 29th December, 2015 By Mirchi Vilas

iBall Andii 5.5H Weber Smart Phone

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ వస్తువల తయారీ సంస్థ ఐబాల్‌ మరో బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండీ 5.5 హెచ్‌ వెబర్‌ పేరుతో ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఫోన్‌ ఆన్ లైన్ తో పాటు రిటైల్ అవుట్ లెట్ల లోనూ లభ్యమవుతోంది. దీని ధర రూ.6,499. ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పనిచేసే ఈ ఫోన్‌ ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. 5.5 అంగుళాల తాకే తెర, 729*1280 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో 32 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సదుపాయం, 2200 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమెరా, 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

iBall Andii 5.5H Weber Smart Phone