ఐబాల్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌

iBall Cobalt 5.5F Youva Smartphone

10:01 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

iBall Cobalt 5.5F Youva Smartphone

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఐబాల్‌ మరో కొత్త ఫోన్‌ని ఆవిష్కరించింది. కోబాల్ట్‌ 5.5ఎఫ్‌ యోవా పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999. భారత్‌లో ప్రముఖ రీటైల్‌ స్టోర్‌లు అన్నింటిలోనూ ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌తో రెండు బ్యాక్‌ కవర్లతోపాటు, మరో ప్రొటెక్షన్‌ కవర్‌ని కూడా సంస్థ వినియోగదారులకు అందిస్తోంది. వినియోగదారుల కంటి కదలికలకు అనుగుణంగా వీడియోలను ప్లే, పాజ్ చేసే వీడియో ఐ కంట్రోల్ టెక్నాలజీని ఇందులో వినియోగించింది.

కోబాల్ట్ 5.5ఎఫ్ యోవా ఫీచర్లు ఇవే..

5.5 అంగుళాల హెచ్ డీ తాకే తెర, 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 64బిట్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత మెమొరీ, ఎస్డీ కార్డుతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 13 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 4జీ సపోర్ట్‌, మైక్రో యూఎస్‌బీ, 2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, యూఎస్‌బీ ఓటీజీ

English summary

iBall Company lauched a new Smartphone called iBall Cobalt 5.5F Youva in India.The price of this smartphone was Rs. 8,999 and it comes with the key features like 5.5-inch HD display,2GB RAM,13-megapixel rear camera,-megapixel front-facing camera ,OTG support,2600mAh battery