9,999 రూపాయలకే ఐబాల్ ల్యాప్ టాప్!

iball laptop is only for 9,999 rupees only

05:33 PM ON 12th May, 2016 By Mirchi Vilas

iball laptop is only for 9,999 rupees only

మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఐబాల్ భారత మార్కెట్లోకి రూ. 9,999 ధరతో సరికొత్త ల్యాప్ టాప్ ను కాంప్ బుక్ ఎక్సలెన్స్ పేరిట విడుదల చేసింది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి సౌకర్యాలున్నాయని ఆ సంస్థ తెలిపింది. వైఫై, రెండు యూఎస్బీ పోర్టులు, బ్లూటూత్, 31 గంటల స్టాండ్ బైతో నిలుస్తుందని వెల్లడించింది. 11.6 అంగుళాల స్క్రీన్ ఉన్న ‘కాంప్‌బుక్ ఎక్స్‌లాన్స్’ ల్యాప్‌టాప్ ధర రూ. 9,999గా, 14 అంగుళాల స్క్రీన్ ఉన్న ‘కాంప్‌బుక్ ఎక్జెంపులర్’ ల్యాప్‌టాప్ ధర రూ.13,999గా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

‘కాంప్‌బుక్’ తయారీ కోసం టెక్నాలజీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇంటెల్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తన ఆదాయంలో 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు తెలిపారు.

English summary

iball laptop is only for 9,999 rupees only. iball laptop is only for 9,999 rupees only.