ఐబాల్ నుంచి స్లైడ్ కిడిల్ 4జీ

iBall Slide Cuddle 4G Tablet

06:51 PM ON 8th January, 2016 By Mirchi Vilas

iBall Slide Cuddle 4G Tablet

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఐబాల్‌ సరికొత్త ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్లైడ్‌ కడిల్‌ 4జీ పేరుతో రూపొందించిన ఈ ట్యాబ్లెట్‌ ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమవుతోంది. డ్యుయల్‌ సిమ్‌ సపోర్ట్‌గల దీని ధర రూ.9,999. 150 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ని ఇది సపోర్ట్‌ చేస్తుంది. తెలుగు, తమిళం సహా మొత్తం 21 ప్రాంతీయ భాషల్ని సపోర్ట్‌ చేస్తుంది. 6.95 అంగుళాల తాకే తెర, 1024*600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 2 జీబీ ర్యామ్‌, 8 మెగాపిక్సల్‌ కెమేరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా, 1గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌,

16 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో మెమొరీని 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం, 4జీ, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, యూఎస్‌బీ ఓటీజీ సపోర్ట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

iBall has launched a new 4G-enabled tablet, the Slide Cuddle 4G, priced at Rs. 9,999. The iBall Slide Cuddle 4G tablet comes with dual 4G SIM support, which can be considered a highlight of the device.