సౌతాఫ్రికా స్పిన్నర్‌ ఫాంగిసోపై ఐసీసీ వేటు

ICC Banned South African Spinner Phangiso

03:34 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

ICC Banned South African Spinner Phangiso

దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ అరోన్‌ ఫాంగిసోపై ఐసీసీ వేటు వేసింది. దేశవాళీ వన్డే మ్యాచ్‌ల్లో ఫాంగిసో ఐసీసీ నిర్దేశించిన 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేతిని వంచి బౌలింగ్‌ చేసినట్లు తేలడంతో అతడిని సస్పెండ్ చేసింది. దీంతో దక్షిణాఫ్రికాతో ఈ నెల 4 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో ఫాంగిసో ఆడటం అనుమానంగా మారింది. బౌలింగ్‌ శైలిని సరిదిద్దుకుని ల్యాబ్‌ పరీక్షల్లో పాస్ అయితే చివరి టీ20 మ్యాచ్‌ ఆడేందుకు ఫాంగిసోకు అవకాశం కల్పిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న సమయంలో ఫాంగిసోపై వేటు పడటం దక్షిణాఫ్రికా జట్టుకు మింగుడుపడటం లేదు. 32 ఏళ్ల ఫాంగిసో దక్షిణాఫ్రికా తరఫున 16 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

English summary

South Africa spinner Aaron Phangiso was banned by ICC for illegal bowling Action.Recently Phangiso's bowling action has been tested and that revealed that all of Phangiso's deliveries exceeded the permissible 15-degree limit.