టీ20 వరల్డ్ కప్ లో అంపైర్లకు హెల్మెట్లు

ICC To Provide Helmets For Umpires In T20 World Cup

10:21 AM ON 30th January, 2016 By Mirchi Vilas

ICC To Provide Helmets For Umpires In T20 World Cup

క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా అంపైర్లకు భద్రత దృష్ట్యా వారికి హెల్మెట్లు అందించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ తెలిపింది. మార్చి 8 నుంచి భారత్‌లో జరిగే టీ20 ప్రపంచ కప్‌ పోటీల్లో వారికి హెల్మెట్లు అందిస్తామని వెల్లడించింది. ఇటీవల మైదానంలో ఇద్దరు అంపైర్లు గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అంపైర్‌ జాన్‌ వార్డ్‌ తలకు బంతి తగలడంతో ఆయన గాయపడ్డారు. అదే విధంగా.. ఈ ఏడాది జనవరి 20న ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగిన కాన్‌బెర్రా వన్డేలో ఇంగ్లండ్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటీబొరాగ్‌ కూడా గాయపడ్డారు. దీంతో ఆ తర్వాత జరిగిన వన్డేకు వార్డ్‌ హెల్మెట్‌ ధరించి మైదానంలో కనిపించాడు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అంపైర్లకు తామే హెల్మెట్లు అందిస్తామని ఐసీసీ ప్రకటించింది. అయితే హెల్మెట్‌ ధరించడం మాత్రం అంపైర్ల నిర్ణయానికే వదిలేసింది. ఈ సందర్భంగా రిచర్డ్‌ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయన్నారు. క్రికెట్‌ బ్యాట్‌లు అధునాతనంగా ఉండటంతో బంతి వేగంగా వెళ్తొందని.. దీంతో మైదానంలో గాయాలవుతున్నాయన్నారు. అందుకే హెల్మెట్‌ ధరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

English summary

International Cricket Council (ICC) to provide helmets to umpires in T20 cricket World Cup which was held in India this year.ICC taken this decision to protect umpires by hitting ball