బాహుబలిపై షాకింగ్ న్యూస్

ID Proofs In Bahubali 2 Movie Shoot

10:46 AM ON 19th February, 2016 By Mirchi Vilas

ID Proofs In Bahubali 2 Movie Shoot

హాలీవుడ్‌ లో సినిమా షూటింగ్‌ సమయంలో బయట వాళ్ళని షూటింగ్‌లోకి అనుమతించరు. కానీ అది ఒక్క హాలీవుడ్‌లోనే జరిగేది. ఇప్పుడు ఇది సౌత్‌ ఇండియాలోకి కూడా ఎంటరయింది. 'రోబో-2' కోసం శంకర్‌ ఇలాంటి వ్యూహాన్నే రచించాడు. 'రోబో-2' షూటింగ్‌ స్పాట్‌లోకి ఎంత పెద్ద వారైనా సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని శంకర్‌ నిబంధన విధించారట. ఇప్పుడు తాజాగా మన తెలుగులో 'బాహుబలి-2' కోసం మన దర్శకధీర రాజమౌళి మరో అడుగు ముందుకు వేశాడు. అదేంటంటే 'బాహుబలి-2' షూటింగ్‌ స్పాట్‌లోకి వచ్చేవారెవరైనా రాజమౌళి ఇచ్చిన ఐడీ కార్డు తీసుకురావాలట. ఒకవేళ వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళైనా ఐడీ కార్డు లేనిదే లోపలకి అనుమతించరట. ఈ విషయాన్ని రాజమౌళి సినిమాటోగ్రాఫర్‌ కె.కె. సెంధిల్‌ కుమార్‌ ట్విట్టర్‌లో ఫోటోతో సహా షేర్‌ చేశాడు.

English summary

In Hollywood they will not allow the guests or the movie unit members without ID proofs.Now this was happening in South film industry also Shankars Robo-2.0 was also shooting in this way and now S.S.Rajamouli's Bahubali-2 was also going on this way this said by Bahubali movie Cinematographer KK Senthil Kumar in Twitter