ఐడియా 4జీ@750 పట్టణాలు

Idea To Expand 4G Services

12:54 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Idea To Expand 4G Services

ప్రముఖ టెల్కో ఐడియా తన 4జీ సేవలను త్వరలోనే 750 పట్టణాలకు విస్తరించనుంది. 2016 జూన్‌ నాటికి 10 టెలికాం సర్కిల్స్‌లోని 750 పట్టణాలకు 4జీ సేవలు విస్తరింపజేస్తామని కంపెనీ తెలిపింది. గత ఏడాది డిసెంబరు నుంచి 4జీ సేవలను విస్తృతం చేయడానికి ఐడియా తీవ్రంగా శ్రమిస్తోందని.. దేశంలోని ఏడు ప్రధాన సర్కిళ్లలో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఐడియా కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శశి శంకర్‌ వెల్లడించారు. 2016 మార్చి వరకల్లా మరో మూడు మార్కెట్లు మహారాష్ట్ర మరియు గోవా, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశాలలో ఐడియా 4జీ సేవలు అందుబాటులోకి తేనుంది. అలాగే 2016 జూన్‌ వరకు 10 టెలికాం సర్కిల్స్‌లో 750 పట్టణాలకు సేవలు విస్తరిస్తాయని కంపెనీ తెలిపింది.

English summary

India's leading telecom company Idea to expand its 4G services to 750 cities by june 2016.This was said by Idea's Cheif Marketing Officer Sasi Shankakar