లీకైన 'సరైనోడు' సాంగ్ వాడితే కేసే!

If we used Sarainodu leaked song then it will be a police case on them

09:29 AM ON 11th March, 2016 By Mirchi Vilas

If we used Sarainodu leaked song then it will be a police case on them

సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణంలో, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'సరైనోడు' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సాంగ్ లీకైందని నిర్మాతలు లీగల్ నోటీసు ఇచ్చారు, ఇందుకు సంబంధించిన ప్రెస్ నోట్ మీడియాకు విడుదల చేసారు. సరైనోడు చిత్రానికి సంబంధించి లీక్ అయిన ఆడియో సాంగ్ ను ఎక్కడ, ఎవరు, ఏ విధంగా ఉపయోగించినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని నిర్మాతలు ఆ ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు కూడా ఆ నోట్ లో నిర్మాతలు తెలియజేశారు.

ఎన్నో కోట్లు ఖర్చు చేసి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మించిన సరైనోడు చిత్రానికి సంబంధించిన లీక్ అయిన కంటెంట్ ను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకోవద్దని నిర్మాతలు హెచ్చరించారు. కాగా కంప్లైంట్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్ర సీన్స్ ప్రస్తుతం బొలీవియాలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ లొకేషన్స్ లో ఎవ్వరూ చిత్రీకరించలేదు. అంజలి ఓ స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు ముందే లీకుల వ్యవహారం ఎదుర్కొన్న 'సరైనోడు' విడుదల తర్వాత ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి మరి.

English summary

If we used Sarainodu leaked song then it will be a police case on them. So don't use and download that song.