రేషన్ కార్డు ఉంటే కోటి రూపాయలు ఇస్తారట!

If you have ration card they will give 1 crore

02:30 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

If you have ration card they will give 1 crore

ఎన్నికల్లో గెలుపు కోసం నెరవేర్చే వీలు కాని హామీలు చేస్తాననడం రాజకీయ నాయకులకు కొత్తేమి కాదు. కానీ, నమ్మశక్యంగాని, అతిశయోక్తిని కలిగించే హామీలతో హిందూ మక్కల్‌ కట్చి(హెచఎంకే) వార్తల్లో నిలుస్తోంది. తమ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే… ఒక్కో రేషన్‌ కార్డు వినియోగదారునికి కోటి రూపాయల చొప్పున అందజేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ఇదే విషయం పై పార్టీ ప్రతినిధి ఒకరు శివకాశిలో విలేకరులతో మాట్లాడుతూ… తమ పార్టీ రాష్ట్రంలోని 234 సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇప్పటికే 136 సీట్లకు అభ్యర్థులను వెల్లడించామని తెలిపారు. రాష్ట్రంలోని ద్రావిడ పార్టీలు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

ఈ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని, ఇందులో మందు బాబులను కోటీశ్వరులుగా మార్చేందుకు వీలుగా ఒక్కో రేషన్‌ కార్డుకు రూ. కోటి చొప్పున అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్నారు. అన్ని రకాల ఉచిత పథకాలు రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు.

English summary

If you have ration card they will give 1 crore