పోస్టల్ స్టాంపులో మీ ఫోటో రావాలంటే 12 లక్షలు కట్టాలి

If you want your photo in postal stamp then you have to pay 12 lakhs

11:44 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

If you want your photo in postal stamp then you have to pay 12 lakhs

ప్రముఖుల ఫొటోలతో పోస్టల్ స్టాంపులు విడుదల కావడం తెలుసు కదా.. దీనికి చాలా హంగామా ఉంటుంది. కొన్ని పద్ధతులు ఉంటాయి. అయితే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఓ కొత్త పధకాన్ని తెస్తోంది. దాని ప్రకారం, ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఇప్పుడు వారి ఫోటో లేదా సంస్థతో లోగోను పొందటానికి రూ.12 లక్షలు చెల్లించి తపాలా బిళ్ళలా ముద్రించుకోవచ్చునట. ఈ విషయం తపాలా విభాగం అధికారులు ప్రకటించారు. మేము వ్యక్తులు మరియు కార్పొరేట్లకు తమ లోగోతో స్టాంపు పొందే అవకాశం కల్పించారు. ఎవరైనా తన లోగో లేదా ఫోటో కొరకు రూ. 12 లక్షలతో ముద్రించిన తమ ఫోటో లేదా లోగోను పొందవచ్చని కార్యదర్శి ఎస్కె సిన్హా చెప్పారు.

గతంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ వారు ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరియు హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థలపై స్టాంపులు విడుదల చేసింది. ఈ సంవత్సరం పోస్టల్ రెవెన్యూ రూ 15000 నుంచి రూ 16000 కోట్లుగా ఉండాలని ప్రణాలికలు వేస్తున్నారు. ఆ ప్రణాలికల్లో భాగంగా ఈ కొత్త పధకాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రతీ సంవత్సరం భారతీయ పోస్టల్ సంస్థ వారు 570 కోట్ల బట్వాడా చేస్తున్నారని సిన్హా తెలిపారు.

English summary

If you want your photo in postal stamp then you have to pay 12 lakhs