ఐఫా అవార్డ్స్ వేడుక వాయిదా!

IIFA film awards function has been postponed

05:43 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

IIFA film awards function has been postponed

డిసెంబర్‌ 5, 6న అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకున్న ఐఫా ఉత్సవ వేడుక వాయిదా పడింది. 20వ శతాబ్ధంలో ఇంటర్నేషనల్ ఇండియన్‌ ఫిలిం ఆకాడమీ అవార్డ్స్(ఐఫా) పేరుతో ప్రారంభమైన ఈ అవార్డ్స్‌ ఇండియన్‌ సినిమా స్ధాయిని పెంచేలా చేసింది. అయితే ఇది ఎప్పడు బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమయింది. తాజాగా సౌత్ఇండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషల సీనీ కళాకారులతో అంగరంగ వైభవంగా ఐఫా ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే వరదల వల్ల అస్తవ్యస్తం అయిపోయిన చెన్నైకి ఈ సందర్భంగా మద్దతుగా నిలబడాలన్న ఉద్దేశంతో ఐఫా సంస్ధ ఈ వేడుకని జనవరి నెలకు వాయిదా వేసింది. హైదరాబాద్‌ గచ్చిబౌలి లో ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన ఈ ఉత్సవం జనవరిలో మళ్లీ ఇదే వేదికలో జరపబడుతుంది. జనవరి నెలలో నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఐఫా సంస్ధ తెలియజేసింది.

English summary

IIFA film awards function has been postponed because of Chennai Floods. And it is going to held on January month.