నన్ను కొనండి... ఫ్లిప్ కార్ట్ లో ఐఐటీ విద్యార్థి

IIT Student Sells Himself in Flipkart For Job

03:32 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

IIT Student Sells Himself in Flipkart For Job

ఉద్యోగం కోసం రెజ్యూమ్ లు పట్టుకుని ఉద్యోగం కోసం రకరకాల కంపెనీల చుట్టూ నిరుద్యోగులు తిరగడం మనం నిత్యం చూస్తుంటాం. అలాంటిది ఒక ఐఐటి విధ్యార్ది మాత్రం వాటికి భిన్నంగా ఒక ప్రయత్నం చేసాడు.

వివరాల్లోకి వెళ్తే ఐఐటి ఖరగ్ పూర్ లో బీటెక్ చదువుతున్న ఆకాష్ నీరజ్ మిట్టల్ అనే ఒక విద్యార్ది ప్రముఖ ఆన్ లైన్ అమ్మకాల సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రోడక్ట్ మేనేజ్మేంట్ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఒక వినూత్నమైన ప్రయత్నం చేసాడు. దీని కోసం ఆకాష్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో తాను అమ్మకానికి ఉన్నానంటూ తన పూర్తి వివారాలలో ప్రొఫైల్ ను ఉంచాడు.

అంతేనా తన ధర 27,60,200 రూపాయలు అని కుడా ఆకాష్ పోస్ట్ చేసాడు. వాటితో పాటు తన ప్రత్యేకతలుగా ఫ్రీ డెలివరీ , లైఫ్ టైం వారంటీ అంటూ ఆఫర్ కుడా ఇచ్చాడు. మిగతా వారితో పోలిస్తే ఆకాష్ మిట్టల్ ఎదినా కొత్తగా చెయ్యాలని భావించాడని , మనలో కొత్తదనం ఉండాలని ఆకాష్ మిట్టల్ భావించినట్లు ఆకాష్ జూనియర్ అయిన బజాజ్ తెలిపాడు.

ఇలా కొత్తగా ఆలోచించిన ఆకాష్ కు ఫిలప్ కార్ట్ సంస్థ స్వాగతం పలుకుతుందని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫ్లిప్ కార్ట్ సంస్థ నుండి ఎటువంటి జాబ్ ఆఫర్ రావకపోవడం విశేషం.

English summary

An IIT student from IIT Kharagpur named Akash Neeraj Mittal applied fora job in Flipkart ina different way.He sells himself in flipkart for Rupees 27,60,200.He also added specifications of him like Life Time Warranty,Free Delivery,Intellectually Curious etc.He says that he wants to think Special which others dont do.