నారారోహిత్‌ చిత్రానికి 'ఇళయరాజా' సంగీతం....

ilayaraja composing music for nara rohit movie

07:14 PM ON 21st November, 2015 By Mirchi Vilas

ilayaraja composing music for nara rohit movie

డిఫరెంట్‌ కధలను ఎంచుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్న నవయువ కధానాయకుడు నారా రోహిత్‌ ప్రస్తుతం తెలుగులో ఏ హీరో లేనంత బిజీగా నారా రోహిత్‌ ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం నారా రోహిత్‌ తొమ్మిది సినిమాలని వరుస పెట్టి విరామం లేకుండా చేస్తున్నాడు. వాటిలో సావిత్రి, తుంటరి, అప్పట్లో ఒకడుండేవాడు, పండగలా వచ్చాడు ఘాటింగ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. మిగతావి వీరుడు, కధలో రాజకుమారి, రాజా చెయ్యి వేస్తే, జ్యోఅచ్యుతానంద సినిమాలు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ తొమ్మిది సినిమాల్లో ఒకటైన కధలో రాజకుమారి చిత్రానికి నూతన దర్శకుడు మహేష్‌ సూరప్‌నేని దర్శకత్వం వహిస్తున్నారు.

ఒక ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా అయితే బాగుంటుందని దర్శకుడు భావించాడు. వెంటనే ఇళయరాజాగారిని సంప్రదించారంట. కధ నచ్చడంతో ఇళయరాజా కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా ఘాటింగ్‌ ప్రారంభం కానుంది.

English summary

ilayaraja composing music for nara rohit movie