యంగ్ టైగర్ - ఇలయదళపతి కలిశారు..

Ilayathalapathy Vijay gave sudden surprise to Ntr

11:10 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Ilayathalapathy Vijay gave sudden surprise to Ntr

జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ చిత్రంలోని కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ జూనియర్ పై షూట్ చేస్తున్నారు. ఇందుకోసం కొరటాల అండ్ టీం 10 రోజుల పాటూ అక్కడే ఉండి షెడ్యూల్ కంప్లీట్ చేయనుంది. కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్, జనతా గ్యారేజ్ టీంకి సడన్ సప్రైజ్ ఇచ్చాడట. మూవీ సెట్ లోకి వచ్చి ఎన్టీఆర్ తోపాటు, జనతా గ్యారేజ్ టీంను అభినందించాడట. యంగ్ టైగర్ తో తన జర్నీ విశేషాలను విజయ్ పంచుకున్నాడట. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందుతున్న హీరో విజయ్, అనుకోకుండా వచ్చి తారక్ ను అప్రిసియేట్ చెయ్యడంతో తమిళనాడులోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

ఏది ఏమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చేత ఆప్యాయంగా తళైవా.. అని పిలుచుకునే యంగ్ టైగర్ ను ఇప్పుడు ఇలయదళపతి నేరుగా వెళ్లి కలుసుకోవటం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కొత్త సందడి షురూ అయింది.

English summary

Ilayathalapathy Vijay gave sudden surprise to Ntr