అంత సీక్రెట్ గా కానిచ్చేసిందా?

Ileana Got Married Secretly to her Boyfriend Andrew Kneebone

11:40 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Ileana Got Married Secretly to her Boyfriend Andrew Kneebone

సినీ తారల గురించి రకరకాల వార్తలు హల్ చల్ చేయడం సహజం. ఇందులో కొన్ని రూమర్స్ ,మరికొన్ని నిజాలు ఉంటాయి. ఇక గోవా బ్యూటీ ఇలియానా గురించి ఓ కొత్త న్యూస్. ఇది రూమర్ కాదని అక్షరాలా నిజమని అంటున్నారు. అదేమిటంటే, ఈ బ్యూటీ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆస్ర్టేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు లవ్ లో మునిగిపోయిన ఇల్లీ, ఫైనల్ గా అతడ్నే గత డిసెంబర్ లో మ్యారేజ్ చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఫ్యామిలీ, బంధువుల సమక్షంలో ఆండ్రూతో మూడు ముళ్లు వేయించుకుని, ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని బంధువుల దగ్గర ప్రామిస్ తీసుకుందని అంటున్నారు. ఆమె బంధువుల్లో ఒకరు నోరుజారడంతో ఈ విషయం బయటపడింద ని అంటున్నారు.

ఈ యవ్వారంపై దుమారం రేపుతున్నా సరే, ఈ భామ నోరు మెదపడకుండా సైలెంట్ కావడం చూస్తుంటే దీనివెనుక బలమైన కారణం ఉందని కూడా అంటున్నారు. రీసెంట్ గా ఆమె నటించిన ‘రుస్తుం’ 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. మరోమూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇప్పుడున్న టైమ్ లో నోరు జారితే ఆఫర్స్ తగ్గిపోతాయని అనుకుని సైలెంట్ అయినట్లు సినీలవర్స్ మాట. ఇందులోభాగంగా ఆరునెలల కిందట పెళ్లి గురించి రకరకాలుగా లెక్చర్ ఇచ్చేసి, వేదాంత ధోరణిలో మాట్లాడిదంటూ కామెంట్స్ పడుతున్నాయి. మొత్తానికి ఈ తతంగంపై ఈ బ్యూటీ నోరువిప్పకపోతే ఇంకా రకరకాల వార్తలు వస్తాయి.

ఇది కూడా చూడండి: ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు!

ఇది కూడా చూడండి: ధనవంతులు కావాలంటే మీ రాశి ప్రకారం ఇలా చెయ్యండి

ఇది కూడా చూడండి: ఆడవారికి పూనకం రావడానికి కారణాలు ఇవే!

English summary

Beauty Ileana Got Married Secretly to her Boyfriend Andrew Kneebone. He is a professional Australian photographer.