చాలామంది 'గే' ఫ్రెండ్స్ ఉన్నారంటూ బాంబ్ పేల్చిన ఇలియానా

Ileana have so many Gay friends

11:44 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Ileana have so many Gay friends

సంచలన వ్యాఖ్యలకు అందరూ సిద్ధమైపోతున్నారు. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా ఈ జాబితాలో చేరింది. చాలాకాలం తర్వాత హైదరాబాద్ వచ్చిన ఈ అమ్మడు బంజారాహిల్స్ లో ఏర్పాటుచేసిన స్కెచర్స్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసింది. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ హైదరాబాద్ ను చాలా మిస్సవుతున్నట్లు చెప్పింది. టాలీవుడ్ కు కావాలని దూరం కాలేదు వైవిధ్యమైన పాత్రలు చేద్దామనుకున్న సమయంలో బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. అందుకే అక్కడ సినిమాలు చేస్తున్నా. ఇప్పటికీ తెలుగులో అవకాశాలు వస్తున్నాయి కానీ ఎక్సైట్ అయ్యే పాత్రలు ఏమీ లేవు.

నేనింతవరకు ఎప్పుడూ, ఎవరినీ అవకాశం ఇవ్వమని అడగలేదు. నా హైదరాబాద్ మిత్రులు త్వరలోనే మంచి ఆఫర్స్ తో వస్తారని ఆశిస్తున్నా అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. తాను తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్టీఆర్ లతో చేశానని ఇంకా చాలా మంది హీరోలతో చేయాలనుంది కాకపోతే తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని చెప్పింది. ఈ సందర్బంగా చాలా విషయాలు మీడియాతో పంచుకుంటూ.. తనకు చాలా మంది 'గే' ఫ్రెండ్స్ ఉన్నారని, వాళ్లు చాలా లవెబుల్ అందరూ అనుకునేలా వారేమి ఉండరని ఇలియానా అంటోంది. తాను హిందీలో చేసిన చిత్రాలన్నీ మంచి పేరు తీసుకొచ్చాయని ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో 'రుస్తుం' అనే సినిమాలో నటిస్తున్నా.

అదీ మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నా అంటూ ఈ గోవా భామ చెప్పింది.

English summary

Ileana have so many Gay friends