ఇలియానా మరీ ఇంత చీపా

Ileana remuneration shocks

01:09 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Ileana remuneration shocks

టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా గుర్తింపు పొంది ఆ తరువాత బాలీవుడ్‌ లో స్థిరపడి పోయిన తార ఇలియానా. ఇక్కడ స్టార్‌డమ్‌ రాగానే బాలీవుడ్‌ వెళ్ళిపోయి స్టార్‌ హీరోయిన్‌ అవుదాం అని తెగ ప్రయత్నిస్తుంది ఈ భామ. కానీ అక్కడ ఈ భామని ఎవరూ పట్టించుకోవడం లేదట. విచ్చలవిడిగా అందాల ప్రదర్శన చేసినా ఆమెకు నిరాశే మిగిలింది. ఇంకేముంది మళ్ళీ అమ్మడుకి సౌత్‌ సినిమాలవైపు గాలి మళ్ళింది.

సౌత్‌ నిర్మాతలను ఇంప్రెస్‌ చేసేందుకు హాట్‌ ఫోటోలతో షాక్‌ ఇస్తున్న ఈ బేబి ఓ స్టార్‌ ప్రొడ్యూసర్‌ సినిమాలో అవకాశం కొట్టేసిందట. ప్రస్తుతం ఈమెకు అంత క్రేజ్‌ లేదు సరికదా వచ్చిన అవకాశాలను భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసి పోగొట్టుకుందట. అందుకే ఈ సారి ఓకే చెప్పేసిందట ఈ గోవా బ్యూటి. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్‌ వింటే షాక్‌ అవ్వాల్సిందే.

సమాచారం ప్రకారం ఈ సినిమాకు 60 లక్షలు రూపాయలు మాత్రమే ఆమె డిమాండ్‌ చేసిందంట. ఈ లెక్కన ఈ అమ్మడు ఎంత చీప్‌ అయిపోయిందో తెలుస్తుంది. ఈ సినిమాతో అయినా బాలీవుడ్‌ లో మరిన్ని అవకాశాలు ఆమెకు వస్తాయో లేదో చూద్దాం. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ సినిమాలో నటిస్తుంది. సౌత్‌లో కూడా ఓ అవకాశం కొట్టేసిందట. మరి ఈమె రీ ఎంట్రీతో పోగొట్టుకున్న స్టార్‌డమ్‌ రావాలని ఆశిద్దాం.

English summary

After hits like Devadasu, Pokiri, Jalsa and Kick she was considered as Top Heroine in Tollywood. After she got stardom she goes to bollywood. Now she came back to south Indian film industry.