గోవా బ్యూటీని కాపాడిన అక్షయ్

Ileana Saved by Akshay Kumar From Tripling Down

11:17 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Ileana Saved by Akshay Kumar From Tripling Down

అక్షయ్‌కుమార్ - ఇలియానా కాంబినేషన్లో బాలీవుడ్ ఫిల్మ్ రుస్తుం వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్లో యూనిట్ బిజీ అయ్యింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇల్లీకి లైఫ్ లాంగ్ ఈ మూవీ గుర్తుండి పోతుందట. అసలు విషయం ఏంటంటే, దీని షూటింగ్ ఎక్కువభాగం లండన్‌లో జరిగింది.

చిత్రీకరణ టైమ్‌లో ఇల్లీ హార్స్‌పై ఉన్నప్పుడు ఒక్కసారిగా గుర్రం అదుపుతప్పింది. ఇంకేముంది ఏం చేయాలో ఈ బ్యూటీ అంతుపట్టలేదు. ఈలోగా అక్కడేవున్న అక్షయ్ వెంటనే హార్స్ మెడకు తగిలించిన తాడు పట్టుకుని దాన్ని అదుపులోకి తీసుకొచ్చాడు. దీంతో ఊపిరి పీల్చు కోవడం గోవా బ్యూటీ వంతైంది. ఈ రియల్ ఇన్సిడెంట్‌ని, రీల్‌గా మారిస్తే బాగుంటుదని డైరెక్టర్‌కు ప్రొడ్యూసర్ సలహా ఇవ్వడంతో ఆ సీన్‌ని కూడా తెరపై చూపించబోతున్నారట. మొత్తానికి ప్రమాదం నుంచి ఇలియానా తప్పించుకుంది తెల్సి, సినీ లవర్స్ తెగ ఆనంద పడిపోతున్నారు.

ఇది కూడా చూడండి: ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు ఎప్పటికీ వాడకూడదట!

ఇది కూడా చూడండి: పడకగదిలో దేవుడు ఫోటోలు ఉండవచ్చా?

ఇది కూడా చూడండి: ఈ ఫుడ్స్ తో గర్భం త్వరగా పొందవచ్చు

English summary

Ileana Saved by Akshay Kumar From Tripling Down