అయ్యో రవితేజను ఇలియానా అంత మాటందా?

Ileana Shocking Comment on Raviteja

11:30 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Ileana Shocking Comment on Raviteja

చిన్నచిన్న పాత్రల నుంచి మాస్‌ మహారాజుగా తన స్థాయిని పెంచుకున్నారు హీరో రవితేజ. ఆయన సినిమాలకు మాస్‌ ఫాలోయింగ్‌ బాగా ఎక్కువ. మాస్‌ మహారాజుగా గుర్తింపు పొందిన రవితేజ రూపం కొద్దిగా కళ తగ్గిందని అందరూ అంటున్నారు. అందులోనిజం లేకపోలేదు. అందుకని రవితేజ తిరిగి అతని పాతరూపంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు. సాలిడ్‌ గా మారేలోపు 6 ప్యాక్‌ చేయాలని రవితేజ నిర్ణయించుకున్నాడు. రీసెంట్‌గా సోషల్‌ మీడియాలో అతడి సిక్స్‌ప్యాక్‌ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలో రాబోతున్న రాబిన్‌హుడ్‌ చిత్రం కోసం ఆయన ఈ ప్యాక్‌ చేసారు అంటున్నాయి  సినీ వర్గాలు.

ఇదిలా ఉండగా మరోవైపు రవితేజ సిక్స్‌ప్యాక్‌ పై ఇలియానా సంచలన కామెంట్స్‌ చేసిందనే పునార్లు ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తున్నాయి. సిక్స్‌ప్యాక్‌ లో బాగానే ఉన్నా రవితేజ ఏజ్‌ ఫేస్‌లో కనిపించేస్తుంది అంటూ ఇలియానా కామెంట్స్‌ చేసిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. కాని ఇప్పటి వరకు అయితే ఈ విషయంపై ఆమె ట్విట్టర్‌ లో కాని, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ ఎలాంటి కామెంట్స్‌ చేయలేదు. మరి ఈ విషయం నిజమో కాదో అనే విషయం ఇలియానా చెప్తే తప్ప తెలిసేలా కన్పించడం లేదు. ఇప్పటికే వీరిద్దరూ కిక్‌, కతర్నాక్‌ చిత్రాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే.సిక్స్ ప్యాక్ తో ఫోటో కి ఫోజ్ ఇస్తున్న రవి తేజ ని చూడాలని ఉందా మరింకెందుకు ఆలస్యం స్లైడ్ షో లో చుడండి మరి 

1/5 Pages

మాస్‌ మహారాజ్ సిక్స్‌ప్యాక్‌

English summary

Tollywood Zero size Actress and Glamours Beauty Ileana commented on Mass Maha Raja Six Pack and all are shocking will these comments