ఇష్టం లేకున్నా చేస్తున్నా.. ఇలియానా షాకింగ్ కామెంట్స్

Ileana shocking comments about her roles in movies

12:02 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Ileana shocking comments about her roles in movies

'దేవదాస్' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కిక్కు భామ ఇలియానా తన అందంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోనూ నటిగా పేరు తెచ్చుకుని పలు సినిమాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన రుస్తుం చిత్రంలో నటిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు తనకు వచ్చిన.. వస్తున్న ఆఫర్లలో చాలా వరకు అయిష్టంగానే నటిస్తున్నానని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. నా కోసం వచ్చే అవకాశాలు.. నాకిచ్చే అవకాశాలు ఏవీ నాకు నచ్చట్లేదు.

అలా అని సినిమాలేవీ ఒప్పుకోకుండా వెండితెరకు దూరమవడం వివేకవంతమైన నిర్ణయం కాదు. అందుకే అయిష్టంగానైనా సినిమాల్లో నటిస్తున్నా అని ఈ అందాల భామ అంటోంది. కమర్షియల్ సినిమాలో నటించడం.. అందాల ఆరబోతకి.. అదనపు ఆకర్షణగా ఉండే పాత్రలు చేయడంలో నాకు పెద్దగా ఇబ్బంది లేదు. సరదాగానే ఉంటుంది. కానీ.. అలాంటివి కొన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు ఆత్మసంతృప్తినిచ్చే సినిమాల్లో నటించాలని అనిపిస్తుంది. ఆ క్రమంలోనే అక్షయ్ కుమార్ నటిస్తున్న రుస్తుం సినిమా అవకాశం వచ్చింది. ఈ చిత్రం నాకు బాగా నచ్చింది. ఇందులో నటించడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది అని మాత్రం చెప్పేసింది.

English summary

Ileana shocking comments about her roles in movies