ఉపాధికోసం వలస వెళ్ళే వారిలో  స్త్రీలు తక్కువేం కాదు

ILO Released The List of Wokers Who Were Going Abroad

11:56 AM ON 18th December, 2015 By Mirchi Vilas

ILO Released The List of  Wokers Who Were Going Abroad

ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోవడమే కాదు , ఉపాధికోసం దేశ సరిహద్దులు కూడా దాటుతున్నారు. ఇలా ఉపాధికోసం ఇతర దేశాలకు వలసవెళ్ళే వారిలో మహిళలే ఎక్కువగా వున్నారు. తాజాగా అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ ) జరిపిన సర్వే లో వలసవెళ్ళే వారిలో మహిళల సంఖ్య తక్కువేం కాదని, భారీగానే వుందని తేలింది. 2013నాటి గణాంకాల ఆధారంగా ఐఎల్ఓ తెల్పిన వివరాలు ఇలా వున్నాయి.

ఐఎల్‌ఓ ఇటీవల విడుదల చేసిన మరో నివేదిక ప్రకారం 2012లో భారత్‌ నుంచి వలస వెళ్లిన వారిలో అత్యధికులు చేరుకున్న తొలి 5 దేశాలు సౌదీఅరేబియా, యూఏఈ, ఇమన్‌, అమెరికా, ఖతార్‌ గా లేక్కతెలింది.

ప్రపంచవ్యాప్తంగా 23.20 కోట్ల మంది ఇతర దేశాలకు వలసవెళ్లగా వీరిలో ఉపాధి కోసమే వెళ్లిన వారి సంఖ్య 15 కోట్లు (72.7శాతం)

వలస కార్మికుల్లో 8.37 కోట్ల మంది (55 శాతం) పురుషుఉలకాగా, 5.57 కోట్ల మంది మహిళలు (37శాతం) ఇంటిపని కోసం విదేశాలకు వెళ్లే వలస కార్మికుల సంఖ్య 1.15 కోట్ల మంది. వీరిలో మహిళలు 88 లక్షల మంది.

మొత్తం వలస కార్మికుల్లో ఉన్నతాదాయ దేశాల్లో ఉన్న వారు 11.23 కోట్లమంది (74.7 శాతం) ఉన్నత-మధ్యస్ధాయి ఆదాయదేశాల్లో ఉన్నవారి సంఖ్య 1.75 కోట్లు భారత్‌ వంటి అల్పాదాయదేశాల్లో వీరి సంఖ్య 1.69 కోట్లు.

పురుష వలస కార్మికుల్లో 50.8 శాతం మంది అరబ్‌ దేశాల్లో పనిచేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంటి పనులు చేసే కార్మికుల సంఖ్య 6.71 కోట్లు కాగా. వీరిలో వలస కార్మికులు 1.15 కోట్ల మంది అయితే వీరికి చట్టబద్ధంగా కార్మికులనే గుర్తింపు అనేకదేశాల్లో లేదు. ఫలితంగా వీరు శ్రమదోపిడికి గురువుతున్నారు.

English summary

International Labour Organisation (ILO) conducted a survey on the no. of workers who was going to foreign countries for Job.According to that survey 6.15 crore people were going abroad for labour work