నాగ్ కి కేటిఆర్ పెద్ద ఫ్యాన్ అట

Im a big fan of Nagarjuna Says KTR

10:19 AM ON 15th February, 2016 By Mirchi Vilas

Im a big fan of Nagarjuna Says KTR

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కి ఘన విజయం చేకూర్చి , నాన్నకు ప్రేమతో (సిఎమ్ కేసిఆర్) విజయాన్ని అప్పటించి , మరోపక్క గులాబి దళంలో ఆనందం నింపిన మంత్రి కేటీఆర్‌ నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే వున్నారు. హైదరాబాద్ కి వివిఐపి లు ఎవరు వచ్చినా కలుస్తూ అభివృద్ధి పై దృష్టి సారించే కెటిఆర్ కి కళా పోషణ, ఆరాధనా కూడా వున్నాయి. తెలుగు వారియర్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు కేటీఆర్‌ హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా సినీ నటుడు నాగార్జున పై తన అభిమానాన్ని కేటీఆర్‌ చాటుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి నాగార్జునకు పెద్ద ఫ్యాన్‌ అని చెప్పారు. వెంకటేశ్‌తో కలిసి చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లను వీక్షించానని చెప్పారు. టీ20 మ్యాచ్‌లు అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.

English summary

Telangana IT and Panchayat Raj minister KTR was attended to Celebrity Champions league final which was held in Hyderabad.In that he says that he was a big fan of Nagarjuna and he lov to see cricket matches and he said that he watched many cricket matches along with Hero Venkatesh.