ఐటెం సాంగ్ కీ రెడీ

Im Ready For Item Songs Says Kajal Agarwal

09:57 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Im Ready For Item Songs Says Kajal Agarwal

ఈ మధ్యే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి 'చందమామ' అనే కాంప్లిమెంట్ అందుకున్న కాజల్, చేతినిండా సినిమాలు పెట్టుకుని కూడా ఐటెం సాంగ్ కి రెడీ అంటోంది. నిజం చెప్పాలంటే చాలామంది ఐటెం సాంగ్ లు చేసి, తమ సత్తా చాటారు. శ్రేయ , శ్రుతి హాసన్ , తమన్నాలు ఐటెంసాంగ్స్‌ లతో కుమ్మేసారు. అయితే కాజల్‌ మాత్రం ఇప్పటి వరకూ వాటికి దూరంగానే ఉంది. అందుకు కారణం ఏంటని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగితే, ‘ఐటెంసాంగ్స్‌ అంటే నాకు గౌరవం. సినిమాలో అందర్నీ ఆకర్షించే అంశం ఏదన్నా ఉంటే అది ఐటెంసాంగ్‌! అయితే ఇంత వరకూ నాకు అలాంటి అవకాశం రాలేదు. ఎవరూ నన్ను అడగలేదు కూడా! అలా ఎవరైనా అడిగితే తప్పకుండా చేసేస్తా’ అంటూ హుషారుగా చెప్పేసింది. అలా అనాలే గానీ ఇక నిర్మాత లు వదులుతారా ఏమిటి? అంటే తొందరలోనే కాజల్ ఐటెం కాబోతోందని అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కుడా చదవండి :

'ఊపిరి' నిర్మాతలు మోసం చేసారు:రాజా రవీంద్ర

ఈగలను వదిలించుకోవటానికి ఇంటి చిట్కాలు

పవన్ ఇంటి ముందు ధర్నా చేస్తానన్న బాబీ

English summary

Heroine Kajal Agarwal says that she was ready to do item Songs in films,She says that item songs will be the attraction for films and she says that up to now no asked her to item songs and thats the reason she was not acted in item songs.