బిల్లు కడితే డేటింగ్ కి రెడీ అంటున్న గేల్

Im Ready To Date Says Chris Gayle

11:58 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Im Ready To Date Says Chris Gayle

ఎప్పుడూ సరదా వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కాడు. ఓ అభిమానితో డేటింగ్‌కి ఓకే చెప్పేశాడు. అదేంటి.. ఆల్రెడీ పెళ్లై ఓ పాపకి తండ్రైన గేల్‌ మరో అమ్మాయితో డేటింగ్‌కి ఎలా ఒప్పుకొన్నాడు అనుకుంటున్నారా? అయితే అసలేం జరిగిందో తెలుసుకోండి. డిల్లీకి చెందిన ఆరోహి అనే అమ్మాయి క్రిస్‌ గేల్‌కి వీరాభిమాని. గేల్‌ అభిమానులతో సరదాగా చాట్‌ చేస్తుండగా, ఆరోహి ‘నీ కోసం నా హృదయం ఉవ్విళ్లూరుతోంది. డేట్‌కి వెళ్దామా?’ అంటూ గేల్‌కి ట్వీట్‌ చేసింది. ఇందుకు గేల్‌ ‘నువ్వే బిల్లు కడతానంటే తప్పకుండా వెళ్దాం’ అని సమాధానం ఇచ్చాడు. ఇందుకు ఆరోహి ఒప్పుకుంటూనే తానూ ఓ కండిషన్‌ పెట్టింది. ‘నీ షరతుకి ఒప్పుకుంటున్నా.. అయితే నాదీ ఓ షరతుంది. వచ్చే ఐపీఎల్‌ మ్యాచ్‌లో నువ్వు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున సెంచరీ కొట్టాలి’ అని ట్వీట్‌ చేసింది. మరి అభిమాని అడిగిన సెంచరీ గేల్‌ కొడతాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:పబ్లిక్ లో ఫ్యాన్ తో అక్కడ చెయ్యి వేయించుకున్న సన్నీ!

ఇవి కూడా చదవండి:సీక్రెట్ ప్లేసులో 'ఓం' టాటూ వేయించుకున్న పాప్ సింగర్!

ఇవి కూడా చదవండి:వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

English summary

West Indies player Chris Gayle was known for his way of Silliness and Gayle said yes to a Delhi girl by saying that i'm ready to date with when you have to pay all the bill.