అడల్ట్‌ సినిమాల్లో నటించడానికి రెడీ

Im Ready To Do Adult Movies Says Nargis Fakhri

10:34 AM ON 26th April, 2016 By Mirchi Vilas

Im Ready To Do Adult Movies Says Nargis Fakhri

అడల్ట్‌, సెక్స్ కామెడీ వంటి సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమేనంటూ బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి సంకేతాలిచ్చేసింది. అయితే ఇక్కడో మరో ట్విస్ట్ ఇచ్చింది. అదేమంటే, బాలీవుడ్‌లో అలాంటి ఫిల్మ్స్ చేయనని క్లారిటీ ఇచ్చేసింది. అమెరికా లేదా విదేశాల్లో అయితే అలాంటి సినిమాలు చేసినా ఎలాంటి అభ్యంతరం వుండదని చెప్పుకొచ్చింది. ఆ విషయంలో సెన్స్‌ హ్యూమర్‌ ఇండియాలో చాలా భిన్నంగా ఉంటుందట. అదే అమెరికా, జర్మనీ, లండన్‌లో అయితే వాళ్ల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ వేరే రకంగా ఉంటుందట. అబ్బో ఈ అమ్మడు భలే స్టడీ చేసేందే.

ఇవి కూడా చదవండి:జగన్ ప్రాణాలు కాపాడిన హీరో శ్రీకాంత్

ఇక బాలీవుడ్‌లో ఇప్పుడు అడల్ట్ కామెడీ సినిమాలకు మంచి మార్కెట్టే ఉంది. గ్రాండ్ మస్తీ, క్యా కూల్ హై హమ్, మస్తీజాదే వంటి పెద్దల సినిమాలు కాసులు రాబట్టాయి. అయితే, బాలీవుడ్‌లో వచ్చిన అడల్ట్ కామెడీ సినిమాలు చూడలేదని నర్గీస్ అంటోంది. అక్షయ్‌ కుమార్, అభిషేక్ బచ్చన్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, లిసా హెడెన్‌ వంటి ప్రముఖ తారాగణంతో సాజిద్-పర్హాద్ ద్వయం 'హౌస్‌ఫుల్-3'ను తెరకెక్కిస్తోంది. ఈ మూవీతో పాటు 'అజార్‌'లోనూ నర్గీస్ నటిస్తోంది. అమెరికాకు చెందిన 36 ఏళ్ల మోడల్ అయిన నర్గీస్‌కు ప్రజెంట్ బాలీవుడ్‌లో మంచి ఆఫర్లే వస్తున్నాయి. మొత్తానికి మనసులోని మాటను నర్గీస్ బయటపెట్టేసింది. హాలీవుడ్ లో ఈమెకు అలాంటి సినిమాల ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి:కాలి బూడిదైన సర్దార్ సెట్
ఇవి కూడా చదవండి:మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

English summary

Bollywood Heroine Nargis Fakhri said in an interview that she was ready to do Adult comedy movies . She says that those type of movies was not accepted in India and those type of movies can do in the countries like America and Germany.