మూడు ఏళ్లుగా ఒంటరి బతుకే

Im Single From Three Years Says Kajal Agarwal

10:14 AM ON 27th May, 2016 By Mirchi Vilas

Im Single From Three Years Says Kajal Agarwal

అవునా, మరి పెళ్లి కానప్పుడు ఒంటరి జీవితమే కదా. అసలు ఈ చందమామ ఎందుకిలా ఫీలయింది. మూడేళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్నానని, తగిన వ్యక్తి కనిపించి..పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని హీరోయిన్ కాజల్ అంటోంది. అప్పటివరకూ పెళ్లిమాటెత్తద్దు అని చెబుతోంది. అయితే, తాను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని మాత్రం పెళ్లాడే ప్రసక్తే లేదంటోంది. వైఫ్ అండ్ హజ్బెండ్ వేర్వేరు ప్రొఫెషన్లలో ఉంటే వారి మధ్య అనుబంధం మరింత బలంగా ఉంటుందని చెప్తోంది.

అంతేకాదు, ఉదయం లేచిన దగ్గర నుంచి అతనికి ఐ లవ్ యూ చెబుతూ కూర్చోలేనని, అలాగని తాను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని అనుకోవద్దంటోంది. ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉంటే మనం ఎలా ఉన్నా సరే ఎదుటివారు అర్థం చేసుకుంటారని పెళ్లికాకుండానే పూర్తి అవగాహనతో మాట్లాడింది కాజల్. అయితే, మూడేళ్లుగా సింగిల్ అంటోన్న కాజల్ అంతకుముందు గురించి చెప్పలేదేంటి అంటూ సోషల్ మీడియాలో కుర్రకారు తెగ ఫీలయి పోతున్నారు.

ఇవి కూడా చదవండి:ఆమెకు కొత్త లవర్ ఉన్నా ఆమె ఇంట్లోనే మకాం వేసిన టాలీవుడ్ హీరో!

ఇవి కూడా చదవండి:హాట్ ఫోజ్ తో మత్తెక్కిస్తున్న అమీ జాక్సన్

English summary

Heroine Kajal Agarwal Says that she was being single from past three years and she will marry who was outside of Movies and then only relationship will be more strong.