గ్రహ సంయోగంతోనే చంద్రోదయం

Impact That Formed Our Moon

10:52 AM ON 2nd February, 2016 By Mirchi Vilas

Impact That Formed Our Moon

భూగ్రహం.. మరో వేరే గ్రహం సంయోగం చెందటం వల్లే చంద్రుని ఆవిర్భావం జరిగిందట. ఈ విషయాన్ని యుసిఎల్‌ఎ భూభౌతిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూమి ఏర్పడిన 100 మిలియన్‌ సంవత్సరాల తరువాత తన పరిభ్రమణంలో మరో గ్రహాన్ని ఢీకొనటంతో ఏర్పడిన ప్లానెటరీ ఎంబ్రియో చంద్రుడిగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు వివరించారు. దాదాపు 4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం అంతరిక్షంలో అత్యంత వేగంతో జరిగిన ఈ సంయోగంలో భూమి థయి అనే గ్రహాన్ని దాదాపు 45 డిగ్రీల కోణంలో ఢీకొన్నదని, రెండు గ్రహాల రాపిడితో విడివడిన ప్లానెటరీ ఎంబ్రియో (నవజాత గ్రహం) ఇప్పుడు మనకు చంద్రుడిగా దర్శనమిస్తున్నదని శాస్త్రవేత్తలు వివరించారు. ఇందుకు సంబంధించిన ఆదారాలను జర్నల్‌ సైన్స్‌ పత్రిక తాజా సంచికలో ప్రచురించారు. గతంలో అపోలో 12, 15, 17 చంద్ర గ్రహ యాత్రల్లో సేకరించిన చంద్రుని శిలలను, భూమి నుండి విడివడిన దాదాపు ఆరు శకలాలను శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించి చంద్రుని ఆవిర్భావాన్ని నిర్ధారించారు. ఈ భూశకలాలలో ఒకదానిని అరిజోనా నుండి మరో ఐదింటిని హవాయి ప్రాంతాల నుండి సేకరించారు.

English summary

UCLA geologist scientists reports says that the secret behind the impact formed our Moon.That Report Says that violent collision 4.5 billion years ago that formed our moon