మంత్రాలయం రాఘవేంద్రస్వామి క్షేత్ర విశిష్టతలు ఇవే

Importance Of Mantralayam Raghavendra Swamy Temple

12:32 PM ON 27th December, 2016 By Mirchi Vilas

Importance Of Mantralayam Raghavendra Swamy Temple

కర్మ భూమి వేదభూమి అయిన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎన్నో వున్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున గల మంత్రాలయం- శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామి జీవసమాధిలోకి ప్రవేశించిన మహిమగల బృందావనాన్ని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం 10వేలమందికి పైగా భక్తులు.. పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటి విశిష్టమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం వెనుక గల కీలక విషయాలు ఎప్పుడు తెలుసుకుందాం.

1/10 Pages

ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా వుండే మంత్రాలయంను మంచాల గ్రామంగా పిలిచేవారు. ఇది ఆదోని నవాబు పాలనలో ఉండేది. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి భావించారట.

English summary

Importance Of Mantralayam Raghavendra Swamy Temple.