లేటు వయస్సులో మూడో పెళ్లికి ఇమ్రాన్ సిద్ధం

Imran khan third marriage

11:02 AM ON 12th July, 2016 By Mirchi Vilas

Imran khan third marriage

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కి బ్రహ్మచారిగా బతకడం బోరు కొడుతోందట. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఇమ్రాన్ ఇప్పుడు మూడో పెళ్లికి సై అంటున్నాడు. అయితే 60 ఏళ్ల వయసులో పెళ్లి అంటే 30 ఏళ్లప్పుడు చేసుకున్నట్టు ఉండదని తనకు తానే సెటైర్ వేసుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పాకిస్థాన్ లో ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇమ్రాన్ ఖాన్ తన మొదటి భార్య జెమీమా గోల్డ్ స్మిత్ తొమ్మిదేళ్లు కలిసున్నారు. విభేదాలతో 2004లో విడిపోయారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వారు ఇంగ్లండ్ లో తల్లితో ఉంటున్నారు. ఆ తర్వాత 11 ఏళ్లు ఒంటరిగా నెట్టుకొచ్చిన ఇమ్రాన్ ముగ్గురు పిల్లల తల్లయిన బీబీసీ యాంకర్ రెహమ్ ఖాన్(42)ను రెండో వివాహం చేసుకున్నారు. గతేడాది జనవరిలో వీరి బంధానికి పుల్ స్టాప్ పడింది. కేవలం పదినెలలు మాత్రమే వీరు కలిసి జీవించడం గమనార్హం. త్వరలో మూడో పెళ్లి చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి చెప్పుకొచ్చాడు. జీవితంలో విడాకులు తీసుకోవడం అంత దురదృష్టకర సంఘటన మరోటి ఉండద ని చెబుతూనే, తాను ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నాడు. 'అయితే రాజీ పడడం తన రక్తంలోనే లేదు' అని చెప్పిన ఇమ్రాన్ మూడో పెళ్లి చేసుకోవాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు.

తన మాజీ భార్య జెమీమాతో విడాకుల గురించి ఇమ్రాన్ మాట్లాడుతూ అది చాలా బాధకరమైన విషయమన్నాడు. అయితే ఇప్పటికీ ఆమెతో ‘చాలా ఫ్రెండ్లీ’గా ఉంటున్నట్టు తెలిపాడు.

ఇది కూడా చూడండి: కలతలు లేని కాపురంలో విడాకుల గొడవ

ఇది కూడా చూడండి: బాబాయి బర్త్ డే కి అబ్బాయ్ ప్లాన్

ఇది కూడా చూడండి: భార్య కోసం ఆడ వేషంలో వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు

English summary

Pakistani cricket legend Imran khan third marriage.