అమరావతిలో ఓటుకు మహేష్ బాబు పేరుతో దరఖాస్తు... ఇదో ఆన్ లైన్ మోసం...

In Amaravathi voter id is registration by Mahesh Babu name

01:13 PM ON 10th September, 2016 By Mirchi Vilas

In Amaravathi voter id is registration by Mahesh Babu name

ఏపీ రాజధాని అమరావతిలో సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఓటరు అవ్వాలని అనుకుంటున్నాడా? అవునో కాదో తెలీదు గానీ మహేష్ పేరుతో ఓ ఓటరు దరఖాస్తు ఆన్ లైన్ లో అధికారులు అందింది. ఓటు కోసం ఫారం 6 దరఖాస్తు తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి అందింది. దీనిపై ఉన్న ఫోన్ నంబర్ కు తహసీల్దార్ సుధీర్ బాబు ఫోన్ చేశారు. తీరా ఇది మహేష్ బాబు పెట్టుకున్న దరఖాస్తు కాదట. ఆ నంబర్ మల్కాపురానికి చెందిన ఓ యువకుడిదిగా తేలింది. ఇలా ఎందుకు దరఖాస్తు చేశావని అధికారులు ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదని యువకుడు సమాధానం ఇచ్చాడట.

మొత్తానికి మహేష్ పేరిట దరకాస్తు చేసినందుకు విచారణ చేపడతామని అధికారులు చెబుతున్నారు. గతంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరిట వైట్ రేషన్ కార్డు, ఇలా ప్రముఖులు, సెలబ్రిటీల పేరిట దారకాస్తులు పెట్టడం, సందెట్లో సడేమియాగా అవి మంజూరైపోవడం జరుగుతున్నాయి. పాపం ఇప్పుడు మహేష్ ని వాడేసుకున్నారు అంతే.

ఇది కూడా చదవండి: భయం గొల్పే పండగ ... శవాలు లేచొస్తాయ్ (ఫోటోలు)

ఇది కూడా చదవండి: ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

ఇది కూడా చదవండి: ఇండియా క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వాలంటే అమ్మల్ని గదిలోకి పంపాల్సిందేనట!

English summary

In Amaravathi voter id is registration by Mahesh Babu name