రెస్ట్ తీసుకుంటున్న దేవుళ్ళు.. బెంగతో భక్తులు

In Bangalore Gods are taking rest

03:58 PM ON 10th May, 2016 By Mirchi Vilas

In Bangalore Gods are taking rest

ఇదేదో బాగుందే, బెంగళూర్ లో దేవుళ్ళు అందరూ రెస్ట్ తీసుకున్నారు. దీనితో తమను అనుగ్రహించే వారు లేక భక్తులు బెంగ పెట్టుకున్నారు. దేవుళ్ళు రెస్ట్ తీసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా? ఓసారి చదివేద్దాం.... బెంగళూర్ లో దేవాలయాల్లో నిర్వహించే పలు పూజలు బంద్ చేసారు. పూజల కోసం గుడికి వెళుతున్న భక్తులు పూజలు చేయించకుండానే ఇళ్ళకు తిరిగి వచ్చేస్తున్నారు. ప‌లు ప్ర‌సిద్ధ మందిరాలు శుక్రవారం నుండి పూజ‌లు నిలిపివేశాయి. ఆల‌యాల వ‌ద్ద నోటీసు బోర్డుల‌ పై పూజ‌లు నిలిపేస్తున్నామంటూ పేర్కొన్నాయి. బెంగళూర్ లో ఇటీవల ప్లాస్టిక్ బ్యాన్ చేయడంతో తక్కువ ధ‌రకు పూజ‌లు అందించ‌లేమ‌ని ఆల‌య అధికారులు అంటున్నారు.

పూజ అనంత‌రం ప్ర‌త్యేకంగా దేవుడి ప్ర‌సాదం అందివ్వడం ఆనవాయితీ. ప్ర‌సాదం ఇవ్వ‌నిదే పూజ పూర్తి అవ్వదని.. ప్రసాదాన్ని అందించే ప్లాస్టిక్ క‌ప్స్ పై నిషేధం ఉండ‌డంతో పూజ చేయడం కష్టంగా మారుతుందని ఆల‌య అధికారులు చెబుతున్నారు. అల్యూమినియంతో త‌యారు చేసే క‌ప్పుల‌ను కొనుగోలు చేయాల్సి రావడంతో.. వీటి ధర ఎక్కువ అవుతుంది. దీనితో కొన్ని ఆల‌యాల వ‌ద్ద నోటీసు బోర్డుల‌ పై పూజ‌లు నిలిపేస్తున్నామంటూ ప్రకటించారు. అదండీ సంగతి.

English summary

In Bangalore Gods are taking rest. In Bangalore temples Gods are taking rest.