పసికందు ఏడ్పు భరించలేక చంపేసిన తల్లి

In California Mother kills four days baby

01:45 PM ON 30th May, 2016 By Mirchi Vilas

In California Mother kills four days baby

ఇది ఏమి ఘోరంరా బాబూ, పాము తన పిల్లల్ని తనే తినేసినట్లు , కన్న తల్లే హతమార్చిందా! వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో ఓ తల్లి తన నాలుగు రోజుల శిశువు ఏడ్పు భరించలేక ఓదార్చే క్రమంలో హత్య చేసేసింది. ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన 22 ఏళ్ళ అయిషా మేరీ పచేకో మే 20న టైలర్ అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. మే 24న ఏడుస్తున్న శిశువును ఓదార్చేందుకు తన శరీరానికి గట్టిగా హత్తుకుంది. దీంతో ఊపిరాడక ఆ బిడ్డ చనిపోయింది. 911కి కాల్ చేయగా ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బిడ్డ చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో హత్యా నేరం కింద అయిషా మేరీ పచేకోను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా బిడ్డను చంపలేదని, ప్రమాదవశాత్తు మాత్రమే ఇలా జరిగిందని ఆ తల్లి అంటోంది. ఏమి జరిగిందో ఆ భగవంతుడికే ఎరుక...

ఇది కూడా చూడండి :ఇండో- అమెరికా మహిళ ను కాల్చేసారు

ఇది కూడా చూడండి :టాలీవుడ్ లో వీళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అని మీకు తెలుసా

ఇది కూడా చూడండి :ప్రియమణి నిశ్చితార్ధం అయింది అతనితోనా!?

English summary

In California Mother kills four days baby.